సీఎం సొంత జిల్లా
ఇసుక దందా..!
కృష్ణానదిలో రోడ్లేసి మరీ తరలింపు
మక్తల్ ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు
చూసీచూడనట్లుగా అధికారుల తీరు
ముఖ్యమంత్రి ఆదేశాలు సైతం బేఖాతరు
తెలంగాణం, మక్తల్ (ఫిబ్రవరి 18) : రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. కాళేశ్వరం, గోదావరి బేసిన్ అడ్డాగా కొంత మంది మంత్రులు ఇసుకను అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు మర్చిపోక ముందే , ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనూ ఇదే దందా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఓంకార ఆశ్రమం, ముడుమల్, ఆర్టీవో చెక్ పోస్టు సమీపంలోని కృష్ణానదిని సాండ్ మాఫీయా అడ్డాగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నది నుంచి దర్జాగా ఇసుకను కర్నాటకకు తరలిస్తున్నారని సమాచారం. నది లోపలి వరకు వెళ్లేందుకు ఏకంగా నదిలోనే రోడ్డునే ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు
ఈ ఇసుక దందా వెనుక వెనుక స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన సపోర్టు తీసుకొని కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయాలు అన్న చందంగా సైలెంట్ గా తమ పని తాము కనిచ్చేస్తున్నారట. అందుకే అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవాల్సిన పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అంతా గుప్ చుప్ అయ్యారని తెలుస్తోంది. ఇటూ కాంగ్రెస్ పెద్దల హస్తం, అటూ అధికారుల అడందండలు ఉండటంతో యధేచ్ఛగా అధిక ధరకు తెలంగాణ ఇసుకను కర్ణాటక బోర్డర్ దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు జోరుగా ఇసుక అక్రమ దందాకు తెగబడ్డారన్న వార్తలతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, ఇసుక రీచ్‌లను కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేయాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే సీఎం రేవంత్ చెప్పి 2 రోజులు అయినా ఆయన మాట ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నేతలు, అటూ అధికారులు సైతం రేవంత్ వ్యాఖ్యలనున బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవేవి పట్టించుకోకుండానే ఇసుక మాఫీయా జోరుగా తమ వ్యాపారాలను కంటిన్యూ చేస్తుందనే చర్చ నడుస్తోంది.