మర్డర్లు...
మానభంగాల రాజ్యం..!
క్రైమ్ సిటీగా మారిన సేఫ్ సిటీ..!
రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్
ఒక్కరోజే 2 హత్యలు, 2 అత్యాచారాలు
MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం
ఓ హోటల్‌లో బాలీవుడ్ నటిపైనా రేప్ అటెంప్ట్
నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య
గాంధీభవన్ వెనుక మరో వ్యక్తి మర్డర్
మహిళలకు రక్షణ కల్పించలేదని సర్కార్..
మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది..?
‘‘రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. పట్టపగలే నడి రోడ్ల మీద దారుణాలు జరుగుతున్నాయి. మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. క్రైమ్ ను కట్టడి చేయాల్సిన పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు క్రైమ్ సిటీగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు జరుగుతుండటంతో జనాలు భయడిపోతున్నారు. సిటీలోని మహిళలకే రక్షణ కల్పించలేని సర్కార్.. మిస్ వరల్డ్ పోటీలకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు‘‘
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 24) : రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మర్డర్లు, మానభంగాలు మితిమిరిపోతున్నాయి. పట్టపగలు నడిరోడ్డు మీద హత్యలు, పబ్లిక్ ప్లేసుల్లోనే అమ్మాయిలపై అగాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక్క రోజులో రెండు మర్డర్లు జరగడం, ఇద్దరి యువతులపై అత్యాచార యత్నాలు జరగడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలకు నిదర్శనంగా మారుతోంది. ఇంట్లో ఉంటే హత్యలు, బయటకు వస్తే హత్యాచారాలు అన్నట్లుగా మారిపోయిందని జనం విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఓ ఈవెంట్ కు వచ్చిన బాలీవుడ్ నటిపైనే అత్యాచారయత్నం జరగిందని, రేపు మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు వస్తే ఇక్కడ నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలకు ఎవరూ రారాని చెబుతున్నారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు పెడతామంటున్న ప్రభుత్వం, ముందు సిటీలోని మహిళలకు రక్షణ కల్పించాలనే డిమాండ్ చేస్తున్నారు.
MMTS రైలులో అత్యాచారయత్నం
హైదరాబాద్ MMTS రైలులో ఓ యువతిపై జరగబోయిన అత్యాచారయత్నం కేసు సంచలనంగా మారింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డడంతో అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రన్నింగ్ రైలులో నుంచి దూకింది. దీంతో యువతి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన ప్రకారం అనంతపురంకు చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తోంది. తన ఫోన్ రిపేరింగ్ కోసం శనివారం సికింద్రాబాద్ వచ్చి తిరిగి సాయంత్రం ఎంఎంటీఎస్ రైలులో మేడ్చల్ కు బయల్దేరింది. అయితే ట్రైన్ లేడిస్ కోచ్ లో ఎక్కింది. అయితే ఆమెతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. దీంతో ఆ బోగీలో ఆమె ఒక్కతే ఉన్న సమయంలో ఓ యువకుడి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయడిపోయిన యువతి అతని నుంచి రక్షించుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేసేంది. దీంతో కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి కిందపడి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి నుంచి స్టేట్ మెంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం
హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న తన ఫ్రెండ్ షాపు ఓపెనింగ్ కోసం ఆహ్వానించడంతో నటి ఒప్పుకుంది. దీని కోసం ఆమెకు కొంత పారితోషకం ఒప్పుకున్నారు. దీంతో సిటీకి వచ్చిన నటికి మాసబ్ ట్యాంక్ లోని శ్యామ్ నగర్ కాలనీలో ఓ అపార్టుమెంట్ లో బస కల్పించారు. అయితే ఈ నెల 21న రాత్రి 9గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఆమె ఉన్న అపార్టుమెంట్ లోకి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె ఒప్పుకోకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి 11గంటల ముగ్గురు వ్యక్తులు ఆమె ఉన్న గదిలోకి వెళ్లారు. తమతో గడపాలని కోరారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఎదురు తిరిగిన ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. లొల్లి పెట్టకుండా నోట్లో గుడ్డలు పెట్టి ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ తర్వాత ఆమె బ్యాగులోని రూ.50వేల నగదు, కొంత బంగారు నగలు తీసుకొని పారిపోయారు. ఆ తర్వాత ఆమె కట్లు విడిపించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
లాయర్ దారుణ హత్య
హైదరాబాద్ లో ఓ లాయర్ దారణహత్యకు గురయ్యాడు. చంపాపేట్ పరిధిలో సోమవారం ఉదయం అంబేద్కర్‌వాడలో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటుంది. ఆమెను ఓ ఎలక్ట్రీషియన్ దస్తగిరి అనే వ్యక్తి గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం బాధితురాలు ఇజ్రాయెల్ కు చెప్పడంతో ఆమె తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న దస్తగిరి సోమవారం అడ్వకేట్‌పై కత్తితో దాడిచేసి హత్యచేశాడు. అందరూ చూస్తుండగా పొడిచాడు. హత్య జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గాంధీభవన్ వెనుక మర్డర్
హైదరాబాద్ నడిబొడ్డు, గాంధీభవన్ దగ్గర ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం మృతదేహంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డుకు కూత వేటు దూరంలో మర్డర్ జరగడంతో రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పని తీరుపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.