బుధవారం సభ జరుగుుతండగా తన సోదరి ప్రియంక గాంధీ వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గలు నిమిరి పలకరించి ఏదో మాట్లాడారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రాహుల్ గాంధీ , ప్రియాంకాగాంధీ తోబుట్టువులు ఇది అందరికి తెలిసిందే. అయితే లోక్ సభలో ప్రతిపక్ష్ నేత రాహుల్ గాంధీ ప్రవర్తన పై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలంతా సభా మర్యాదను పాటించాల్సిందేనని అన్నారు. బుధవారం సభ జరుగుుతండగా తన సోదరి ప్రియంక గాంధీ వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గలు నిమిరి పలకరించి ఏదో మాట్లాడారు.
. "సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు అయినప్పటికీ తప్పకుండా అందరూ సభా నియమాలు పాటించాలి" అని బిర్లా పేర్కొన్నారు. అయితే ఇలా సభలో బుగ్గలు నిమరడాన్ని స్పీకర్ తప్పుబడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
LS speaker schools Rahul Gandhi for his behaviour inside Parliament. pic.twitter.com/DrNN6sJROT — Ankur Singh (@iAnkurSingh) March 26, 2025