మహిళా ఎమ్మెల్యేను అవమానించిన స్పీకర్..!


Published Mar 25, 2025 10:29:27 AM
postImages/2025-03-25/1742878767_Capture.JPG

మహిళా ఎమ్మెల్యేను
అవమానించిన స్పీకర్..! 
ప్రజా సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
ఆమె మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు..
వాళ్లు ఎలా వింటున్నారో అంటూ మైక్ కట్ చేసిన స్పీకర్
సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్..
సభలో మహిళను అవమానించడం కాదా..?
చర్చనీయాంశంగా మారిన స్పీకర్ వ్యవహారశైలి

తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 24) : అసెంబ్లీ నిండు సభలో ఓ మహిళా ఎమ్మెల్యేను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా అవమానపరిచేలా ప్రవర్తించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు మైక్ ఇవ్వాలని కోరగా ‘‘నాకే వినాలనిపిస్తలేదు.. వాళ్ళు (అధికార పార్టీ సభ్యులు) ఎలా వింటున్నారో నాకు అర్ధం కావట్లేదు అంటూ మైక్ కట్ చేశారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకరే ఇలా మాట్లాడి నిండు అసెంబ్లీలో ఓ మహిళా ఎమ్మెల్యేను అవమానించడం కాదా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.  

వివాదాస్పాదంగా స్పీకర్ తీరు

ఢిల్లీలో ఓ జడ్జీ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం ఇప్పుడు దేశ న్యాయవ్యవస్థను ఓ కుదుపు కుదిపేస్తుంది ? అలాగే.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వ్యవహార శైలి కూడా చాలా వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పుడు ఓ మహిళా ఎమ్మెల్యేను అవమానించడమే కాదు. ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టులో రోజుకో మాట మార్చడం, నోటీసులకు సరిగ్గా స్పందించకపోవడం, స్పీకర్ ను ప్రశ్నించడమే సభాసాంప్రదాయాలకు విరుద్ధం అన్నట్లుగా మాట్లాడడం, ఈ కారణంగా ఓ సభ్యుడిని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అంతే కాదు సస్పెండ్ చేసి 12 రోజులు దాటినా ఇప్పటి వరకు అధికారికంగా బులెటిన్ ను సైట్ లో పెట్టకపోవడం ఇదంతా కూడా స్పీకర్ గారూ న అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. 

సీఎం బూతులు.. ప్రవచనాలా..?

అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బండ బూతులు తిడుతుంటే ప్రవచనాలు విన్నట్లుగా అంతా విన్నారని, బూతులు తిట్టొద్దని చెప్పాల్సిన స్పీకర్ సైతం మౌనంగా ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటి బూతులు తిడుతుంటే విన్న స్పీకర్, సభ్యులు, ఓ మహిళా సభ్యురాలు తన నియోజకవర్గంలోని సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చెబుతుంతే నాకే వినాలనిపించడం లేదని చెప్పడం స్పీకర్ అనడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. స్పీకర్ గా సభా హుందాతానాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఇలా ఏకపక్షధోరణి, ఒక పార్టీ పట్ల పక్షపాతం చూపించడం కాదా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. 

సుప్రీం నోటీసులకు నో రెస్పాన్స్

స్పీకర్ కు ఉన్న విచక్షణ అధికారాలతో హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే విషయంలో సుప్రీంకోర్టు సైతం స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారో సమాధానం ఇవ్వాలని మూడు నోటీసులు పంపినా నో రెస్బాన్స్. రిజిస్టర్ జ్యూడిషియల్ ఆఫ్ హైకోర్టు, సుప్రీం కోర్టు ఆర్పీఐడీతో పాటు ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఇచ్చిన నోటీసులకు కనీసం స్పందించలేదు. ఈ నెల 22 వరకు సమాధానం కచ్చితంగా ఇవ్వాల్సిందే అని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లెక్క చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


స్పీకర్ గా తనకు ఉన్న అధికారులను అడ్డుపెట్టుకొనే తనను ఎవరూ ప్రశ్నించొద్దని, తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే సభలో ప్రశ్నించిన సభ్యుడిని సస్పెండ్ చేశారని, సమస్యలు గురించి ప్రస్తావించిన మహిళా ఎమ్మెల్యేను అవమానించారని, ఫిరాయింపుల కేసులో హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయలేదని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : mla brs speaker delhi

Related Articles