రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం అణు విద్యుత్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భారతీయ రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం శిలాజ ఇంధనం వినియోగాన్ని తగ్గించి అణువిద్యుత్ వినియోగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే మాట గట్టిగా వినిపిస్తుంది. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ రాజ్యసభలో లేవనెత్తిన సమస్యపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన లిఖితపూర్వమైన సమాధానం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది.
రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం అణు విద్యుత్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ మంత్రిత్వ శాఖలను సంప్రదించామని వివరించారు.
అయితే దీని వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి . అణు విద్యుత్ వినియోగం వల్ల వచ్చే సమస్యలు, పర్యావరణంపై దీని ప్రభావంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అణు విద్యుత్ స్వచ్చమైన ఇంధన వనరుగా ఆయన పేర్కొన్నారు. దీని వల్ల శిలాజ ఇంధనం పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది . దీని వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.