tandel :వందకోట్ల వైపు అడుగులేస్తున్న నాగచైతన్య సినిమా తండేల్ !

మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.


Published Feb 11, 2025 01:46:00 PM
postImages/2025-02-11/1739262037_Thandel3rdCollectionsVjpg1280x7204g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య , సాయిపల్లవి జంటగా నటించిన మూవీ తండేల్ . చందుమొండేటి డైరక్షన్ లో వచ్చిన తండేల్ మూవీ వంద కోట్ల బాటలో నడుస్తుంది. ఎట్టకేలకు నాగచైతన్య కెరియర్ లో వంద కోట్ల సినిమా బోనీ జరగనుందంటున్నారు . నాగచైతన్య బడ్జెట్ లో దాదాపు హెవీ బడ్జెట్ సినిమా ఇదే . మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.


విడుద‌లైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.73.20 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌య‌న్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించింది. ఈ వీకెండ్ కు వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని సినీ పెద్దలు చెబుతున్నారు.  మొద‌టి రోజే రూ.21.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అక్కినేని నాగ‌చైత‌న్య సినీ కెరీర్‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది.


రాజు, స‌త్య పాత్ర‌ల్లో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు జీవించేశార‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో అయితే చైతు కంటతడి పెట్టించేశాడని కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు , ఫ్యాన్స్. శ్రీకాకుళం జిల్లాలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్ధ గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya tandel saipallavi

Related Articles