బెంగళూరు మొత్తానికీ అత్యంత ఖరీదైనదేమో అని కామెంట్ చేశాడు. ఇంత చిన్న అగ్గిపెట్టెకు నెలకు 25 వేలు అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బెంగుళూరు ఈ మధ్య కాలంలో భయంకరమైన ట్రెండింగ్ లో ఉంది. ఆటోవాలాలే కాదు. ఇంటి ఖర్చులు కూడా చాలా ఎక్కువే. రీసెంట్ గా ఓ వ్యక్తి బెంగుళూరులో తన అద్దె ఇంటి కష్టాలను ఓ నెటిజన్ సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నాడు. తాను ఉంటున్న సింగిల్ బెడ్ రూం ఇంటికి సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. గది మధ్యలో నిలుచుని చేతులు చాపితే అటుఇటూ గోడలు తగులుతున్న ఈ రూమ్ బహుశా బెంగళూరు మొత్తానికీ అత్యంత ఖరీదైనదేమో అని కామెంట్ చేశాడు. ఇంత చిన్న అగ్గిపెట్టెకు నెలకు 25 వేలు అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ గది వల్ల తను నెలనెలా తన జీతంలో చాలామొత్తం పొదుపు చేస్తున్నానని చెప్పాడు. గది చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ వస్తువులు కొనడం తప్పిందని, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు కొనాలని అనుకున్నా వాటిని ఉంచేందుకు స్థలం లేక ఆ ఆలోచన విరమించుకోవాల్సిందేనని అన్నాడు.
నాకే సరిపోని ఈ గదికి మరో వ్యక్తిని అదే భార్యను తీసుకురాలేదు. బెంగుళూరు ఖర్చులు భరించేవి కాదంటు వాపోయాడు. కొందరేమో బ్యాచిలర్ లైఫ్ కు ఈ రూమ్ పర్ ఫెక్ట్ గా సరిపోతుందని చెప్పగా మరికొందరేమో తమ బాత్రూమ్ ఇంతకన్నా పెద్దగా ఉంటుందని అంటున్నారు. మరికొంతమంది అయితే ముంబై లో కూడా ఇదే పరిస్థితి అంటూ చెప్పుకొచ్చారు.