పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
న్యూస్ లైన్ , డెస్క్ : తెలంగాణలో రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. ‘మీ సేవ’ అధికారులతో నిన్న పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరిపారు. దరఖాస్తులు స్వీకరణ ఆప్షను అధికారులు తిరిగి ప్రారంభించారు. అంతేకాదు మూడు రోజుల చర్చలు తర్వాత ఈ డిస్కర్షన్స్ కంప్లీట్ అయ్యాయి.
పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే టెక్నికల్ రీజన్స్ కారణంగా వెబ్ సైట్ నుంచి 8 వ తారీఖు కనిపించలేదు. దీని వల్ల అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజన్ మొదలైంది.ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు. ఇప్పటికే ప్రజాపాలన, కులగణన, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.