రీజనబుల్ టైం అంటే ఏంటీ ?


Published Feb 01, 2025 11:51:45 AM
postImages/2025-02-01/1738390905_WhatsAppImage20250201at11.42.46AM.jpeg

రీజనబుల్ టైం అంటే ఏంటీ ? (టైటిల్)

అసెంబ్లీ కార్యదర్శిపై సుప్రీంకోర్టు సీరియస్ (టైటిల్)

స్పీకర్ నిర్ణయం ఎప్పటిలోపు తీసుకుంటారో..

వారంలోపు చెప్పాలి : సుప్రీం కోర్టు

BRS ఎమ్మెల్యేల ఫిరాయింపుపై విచారణ

చర్యలకు ఇంకా సమయం కావాలన్న న్యాయవాది

రీజనబుల్ టైం అంటే శాసనసభ గడువు ముగిసే వరకా ?

మహారాష్ట్ర స్పీకర్ తీసుకున్నట్టు చివర్లో తీసుకుంటారా ?

అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాదిపై సుప్రీం ప్రశ్నలు

స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెబుతామన్న ముకుల్

విచారణ వచ్చే వారానికి వాయిదా

 

 

‘‘ రేవంత్ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగలింది. గత 10 నెలలుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ స్పీకర్ తీరును తప్పు పట్టింది. చర్యలు తీసుకునేందుకు మరింత సమయం కావాలని అడగడంపై మండిపడింది. ఇంకెంత కాలం కావాలంటూ ప్రశ్నించింది. శాసనసభ గడువు తీరే వరకా అంటూ సీరియస్ అయ్యింది. పార్టీ మారిన అభ్యర్ధులపై ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారో వారం రోజుల్లోగా చెప్పాలంటూ ధర్మాసనం ఆదేశించింది.‘‘

 

తెలంగాణం, హైదరాబాద్ (జనవరి 31) : బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గత 10 నెలలుగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో హైకోర్టు చెప్పినా ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

 

ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గుర్తు చేశారు. అయితే దీనిపై న్యాయస్థానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ మండిపడింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అంటూ స్పీకర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో స్పీకర్ ను అడిగి నిర్ణయం చెబుతామని న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. వారం రోజుల్లోగా ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

 

newsline-whatsapp-channel
Tags : supremecourt brs congress

Related Articles