జపాన్ లోని ఒసాక కేంద్రంగా పనిచేసే ‘సైన్స్ కో’ సంస్థ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను రూపొందించింది. దీనిని 50ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏదైనా కనిపెట్టాలంటే జపాన్ తర్వాత. భలే వింత వింతవి కనిపెడుతుంది. సరికొత్తగా హ్యూమన్ వాషింగ్ మిషన్ ను కనిపెట్టింది. ఈ మిషన్ లో మీరు పడుకుంటే మీకు ఎంత టైం స్నానం అవసరమో ...ఎలాంటి వాష్ కావాలో...చెప్పేస్తే మీరు బెడ్ పై పడుకుంటే బరా బరా పామి మరీ మిమ్మల్ని తోమేస్తుంది.‘హ్యూమన్ వాషింగ్ మిషన్’ను చక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి, ఒంటిపై తడిలేకుండా ఆరబెట్టేస్తుంది.
జపాన్ లోని ఒసాక కేంద్రంగా పనిచేసే ‘సైన్స్ కో’ సంస్థ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను రూపొందించింది. దీనిని 50ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పో సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ అయిన ప్రస్తుత పానసోనిక్ దీనిని మొదటిసారి తయారు చేసింది. ఈ వెర్షన్ తో పోలిస్తే కొత్త దానిలో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారు చెబుతున్నారు.
మీ స్కిన్ కండిషన్ ను కూడా అది స్కాన్ చేస్తుంది. మరీ డ్రై అయితే కాస్త మాయిశ్చరైజర్ పెట్టి...లైట్ సోప్స్ వాడుతుంది. అది బాగా ఆయిలీ అయితే మరో రకం ఇలా అన్ని తనే చూసుకుంంటుంది.ఈ ప్రదర్శన తరువాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ ను 2025లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది చాలా పెద్దగా ఉంది. చిన్న సైజ్ లో అడ్జస్ట్ చేసి అప్పడు మార్కెట్లో రిలీజ్ చేస్తారట.