సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం సూర్య కిరణాల పై మరింత డెప్త్ గా తెలుసుకుంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మిషన్ ద్వారా రెండు శాటిలైట్స్ ను నింగిలోకి పంపించారు. ఇది భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సూర్యుడి బాహ్య వాతవారణం అయిన కరోనా పై పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు ఈ రెండు ఉపగ్రహాల సాయంతో సూర్యునిపై కృత్రిమంగా సూర్యగ్రహనాన్ని కూడా సృష్టించవచ్చు
శ్రీహరి కోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం సూర్య కిరణాల పై మరింత డెప్త్ గా తెలుసుకుంటుంది.
వాస్తవానికి డిసెంబర్ 4 సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని ఆ మర్నాటికి వాయిదా వేశారు. తిరిగి డిసెంబర్5న సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. ప్రోబా-3ని రూపొందించింది.
విజయవంతంగా నింగిలోకి పంపారు ఒకే కక్ష్యలో ఏర్పాటు చేశారు కూడా. ఈ ప్రయోగం సూర్యుని బాహ్యవాతావరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.