ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రోజుకు 2 బిలియన్లకు పైగా కాల్స్ చేస్తుంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంది. ప్రతిరోజు కోట్లాది మంది వాట్సాప్ ని ఉపయోగిస్తారు. వాట్సాప్ లో చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్స్ ఏం ఉన్నాయో చూద్దాం. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రోజుకు 2 బిలియన్లకు పైగా కాల్స్ చేస్తుంటారు.
మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు, డెస్క్‌టాప్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి వాట్సాప్ అనేక కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తోంది. సూపర్ సక్సస్ అవుతున్నాయి కూడా. వీడియో కాల్స్ కోసం వాట్సాప్ ఫన్ ఎఫెక్ట్‌లను కూడా చేర్చింది. వాట్సాప్‌తో వీడియో కాల్ చేస్తున్నప్పుడు 10 ఫన్ ఎఫెక్ట్‌లను ఎంచుకోవచ్చు.
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వీడియో కాల్స్ బాగా మెరుగుపరిచింది. డెస్క్ టాప్ యాప్ లోని ట్యాబ్ కు చాలా ఆప్షన్లను చేర్చింది. ఇప్పుడు ఎవరైనా కాల్ ట్యాబ్ ని ఓపెన్ చేస్తే మీరు కాల్స్ అనేబుల్ చేయొచ్చు. కాల్ లింక్ క్రియేట్ చెయ్యడం లేదా నెంబర్ ను నేరుగా డయల్ చెయ్యడం చాలా ఈజీ. ఫోన్ కాల్స్ చేస్తున్నపుడు డెస్క్ టాప్ లను ఉపయోగించే వ్యక్తులకు వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నపుడు మీకు హైరెజల్యూషన్ వీడియో కాలింగ్ సపోర్టు కూడా అందిస్తుంది.