Smart Phones: మోటరోలా నుంచి కొత్త ఫోన్ ..10 వేల లోపే 5జీ ఫోన్ !

డిసెంబర్ 16 మద్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ , మోటరోలా అధికారిక వెబ్ సైట్ పై ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.


Published Dec 10, 2024 04:27:00 PM
postImages/2024-12-10/1733828259_motog85.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫోన్ల తయారీ దిగ్గజం మోటరోలా కంపెనీ భారత్ లో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. 5 జీ సామర్ధ్యంతో మోటో జీ 35 ఫోన్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. ‘జీ సిరీస్‌’ ఫోన్ల‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చింది. లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, గువా రెడ్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది. 4జీబీ మెమొరీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధర రూ.9,999గా మోటరోలా ప్రకటించింది. అయితే డిసెంబర్ 16 మద్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ , మోటరోలా అధికారిక వెబ్ సైట్ పై ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.


ఫీచర్ల విషయానికి వస్తే  6.72-అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ తయారైంది. ఎఫ్‌హెచ్‌డీ+ 120హెర్ట్జ్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. యూనిసాక్ టీ760 ప్రాసెసర్ ఎస్‌వోసీ ఉన్నాయి. కెమరా విషయానికి వస్తే వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమరా , 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమరా ఉన్నాయి. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫేసింగ్ కెమరా ఉంది. 18 వాట్స్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 5000 ఎంఏ హెచ్ సామర్ధ్యమున్న బ్యాటరీ ఉంది. ఇది పన్నెండు 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. భారత్ లో 5జీ సెగ్మెంట్లో ఇదే వేగవంతమైన ఫోన్ అని మోటరోలా చెబుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mobile-phone

Related Articles