ఈ సారి స్వర్ణ విమాన గోపురం కలిగి ఉంది. ఈ గోపురం చాలా మంచి అనుభూతిని కలిగించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. నేటి నుంచి 11 రోజుల వరకు ఈ వార్షిక బ్రహూత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ సారి స్వర్ణ విమాన గోపురం కలిగి ఉంది. ఈ గోపురం చాలా మంచి అనుభూతిని కలిగించింది.
మార్చి 1న స్వస్తి వచనంతో మొదలయిన బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం ,8వ తిరుకళ్యాణ మహోత్సవం , 9 వ తేదీ దివ్య విమాన రథోత్సవాన్ని చేస్తున్నారు. 11న గర్బాలయంలోని మూల విరాట్లకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకం తో బ్రహోత్సవాలు ముగియనున్నాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారికి నిత్యకళ్యాణం , శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు.