harishrao: 11 ఏళ్ల క్రితం ఫొటోను షేర్ చేసిన హరీష్ రావు !

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని కేసీఆర్ తో సంబరాలు చేసుకున్న ఫొటోను హరీష్ రావు పోస్టు చేశారు. 


Published Feb 18, 2025 01:37:00 PM
postImages/2025-02-18/1739866081_394572harish.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 18 కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది . ఫిబ్రవరి 18 లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదించబడింది. ఈ సంధర్బాన్ని గుర్తు చేసుకుుంటూ బీ ఆర్ ఎస్ కీలక నేత , మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని కేసీఆర్ తో సంబరాలు చేసుకున్న ఫొటోను హరీష్ రావు పోస్టు చేశారు. 


కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు. అంతే కాదు రాజ్యాంగబద్దంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సంధర్భమని , పట్టుదల , నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అంటూ తెలిపారు హరీశ్ రావు . ఆయన 11 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు , శ్రీనివాస్ గౌడ్ , విఠల్ మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : kcr newslinetelugu loksabha harish-rao

Related Articles