జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 44 మంది ఆఫీసర్లను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం జీవో విడుదలచేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగా, ఈ క్రమంలో ఐఏఎస్ అధికారినికి ఆమ్రపాలికి ఐదు పోస్టులు కేటాయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమ్రపాలి కంటే ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు పోస్టులు ఇచ్చారు. దాంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.