తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది గా గుర్తించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గత 17 రోజులుగా ఎస్ ఎల్బీసీ టన్నెల్ సహాయకచర్యలు చేపడుతున్నారు. దాదాపు 14వ కిలోమీటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదం లో 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే .17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
నిన్న తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీమ్ కు నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది గా గుర్తించారు. అతని మృతదేహాం లభించిన చోటే ..మరో ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ రెండు మృతదేహాలను నేడు వెలికితీయనున్నారు.
కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన ఈ జాగిలాలు... మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.