హీరో అల్లు అర్జున్ , నిర్మాత దిల్ రాజు చాలా మంది అమెరికా వెళ్లారు, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్ దిల్ రాజు పాల్గొన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ..డాలస్ నగరంలో తన ఫ్యాన్స్ తో కాసేపు టైం స్పెండ్ చేశారు. డాలస్ లో నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హీరో అల్లు అర్జున్ , నిర్మాత దిల్ రాజు చాలా మంది అమెరికా వెళ్లారు, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్ దిల్ రాజు పాల్గొన్నారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సంక్రాంతి పందెంకోడిగా తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలుగించడానికి రామ్ చరణ్ వస్తున్నాడు.
రిలీజ్ డేట్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగానే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా గేమ్ చేంజర్ చరిత్ర సృష్టిస్తోంది. తమన్ మ్యూజిక్ తో పాటు శంకర్ మ్యాజిక్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి . ఇప్పటికే జరగండి జరగండి సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేసింది.