vishaka: విశాఖ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం !

విద్యుత్​ తీగలు తెగిపడిన ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


Published Dec 22, 2024 12:21:00 PM
postImages/2024-12-22/1734850449_1298296vizagrailwaystation.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విశాఖ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఉదయం 5.20 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు తిరునల్వేలి - పురిలియా రైలు వచ్చింది. తొలగించిన రైలు ఇంజిన్ ముందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగాయి. దీంతో రైలు ఇంజిన్ విద్యుత్ తీగను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్​ నిలిపివేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే స్టేషన్ లో విద్యుత్ తీగలను రిపేర్ చేస్తున్నారు. విద్యుత్ తీగల పనులను డీ ఆర్ ఎం మనోజ్ సాహూ అబ్జర్వ్ చేస్తున్నారు. విద్యుత్​ తీగలు తెగిపడిన ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


విశాఖ రైల్వే స్టేషన్​లో విద్యుత్​ తీగలు తెగిపడిన ఘటనపై రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. మూడో నంబరు ప్లాట్ ఫారం పై విద్యుత్ తీగలు మారుస్తున్నాయి. స్టేషన్ లో ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదాలు ఏం జరగకముందే అధికారులు అలర్ట్ అయ్యారని తెలిపారు. రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయని తూర్పు కోస్తా రైల్వే స్పష్టం చేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department

Related Articles