న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ అసలు మనిషేనా ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంటూ సీరియస్ అయ్యారు. సెక్యూరిటీ చాలదని..అల్లు అర్జున్ వస్తే పరిస్థితి కంట్రోల్ చెయ్యలేమని డీసీపీ చెప్పినా అల్లు అర్జున్ వినలేదు ..ఆ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే ..ఇండస్ట్రీ అంతా అతనిని పరామర్శిస్తుందేంటి ..అంటూ సీరియస్ అయ్యారు.
మీరు వెళ్లకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని డీసీపీ హెచ్చరించి, ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోకుండా... కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి, చేతులు ఊపుతూ వెళ్లాడని విమర్శించారు. అంటే ఇది డైరక్ట్ గా కావాలనే చేశారుగా ...మరి ఆయనకి ఎందుకు ఈ పరామర్శలు. ఇండస్ట్రీ హీరోలకు పెద్దలకు ఇందులో ఏం అర్ధమవుతుందో తెలీదు కాని ఇక పై ఓ నిర్ణయం తీసుకుంటున్నాము.
ఇకపై ఏ సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతించబోమని రేవంత్ స్పష్టం చేశారు. తన పదవీ కాలంలో ఉన్నంత కాలం ఈ ధరల పెంపు ఉండదు..బెనిఫిట్ షోలు కుదరవు అని తేల్చేశారు.