చైనాలోని షాంఘైలో ఒక టీనేజ్ అమ్మాయి తన తల్లికి చెందిన ఒక మిలియన్ యువాన్ల ( రూ. 1.16 కోట్లు) విలువైన ఆభరణాలను దొంగిలించి కేవలం 60 యువాన్లకు ( రూ. 680) అమ్మేసి లిప్ స్టడ్స్ కొనుక్కుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏం జనరేషనో ఏమో ...తెలివైన వాళ్లు అనుకోవాలో ...తెలీక చేస్తున్నారనుకోవాలో తెలీదు . కాని అన్నీ బక్వాస్ పనులే చేస్తున్నారు. చైనా లో ఓ టీనేజర్ తన తల్లితో గొడవపడింది. ఎందుకంటే తనకు లిప్ కు స్టడ్స్ కుట్టించుకుంటానని రోజు గొడవ పడేది. తల్లి వద్దని వారించేది. ఇక తిక్క రేగిన ఆ పిల్ల ఏం చేసిందంటే తన తల్లి కోటిన్నర రూపాయిల నగలు దొంగిలించేసింది. ఆ తర్వాత పిల్ల పని చూడాలి. తల్లికి షాకులు మీద షాకులు తగిలాయి.
చైనాలోని షాంఘైలోని వాన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైలో ఒక టీనేజ్ అమ్మాయి తన తల్లికి చెందిన ఒక మిలియన్ యువాన్ల ( రూ. 1.16 కోట్లు) విలువైన ఆభరణాలను దొంగిలించి కేవలం 60 యువాన్లకు ( రూ. 680) అమ్మేసి లిప్ స్టడ్స్ కొనుక్కుంది. తల్లికి సంబంధించిన జేడ్ బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు, జెమ్ స్టోన్ సహా అధిక విలువైన ఆభరణాలను దొంగిలించి ఆపై విక్రయించిందని తెలిపింది. కాని అంత ఖరీధైన నగదును ఇలా 600 లకే అమ్మేస్తుందని అనుకోలేదని వాపోయింది.
ఆ లిప్ స్టడ్ ధర 30 యువాన్లు ( రూ. 340) అని లీ చెప్పింది. ఆమె 30 యువాన్ల ధర గల మరో జత లిప్ స్టడ్స్ కావాలని అడిగింది. దాంతో మొత్తం 60 యువాన్లు కావాల్సి వచ్చింది. అయితే, అందుకు తల్లి అంగీకరించలేదు. ఎలాగైన వాటిని కొనాలని నిర్ణయించుకున్న యువతి తల్లి లేని సమయంలో ఇంట్లోని విలువైన ఆభరణాలను దొంగిలించి విక్రయించింది. మైనర్ కావడంతో ఎక్కడ అమ్మాలో తెలియలేదు. నిజానికి అసలు అవి బంగారు నగలని ...అవి అమ్మితే చాలా డబ్బులు వస్తాయని కూడా తెలీదు. కథ విన్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ట్రాక్ చేసి అమ్మేసిన అన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.