BANKS: అక్టోబర్ లో ఈ నెల బ్యాంకులకు బోలెడు సెలవులు !

కొన్ని నేషనల్ హాలిడేస్ . మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని మీరు ప్లాన్ చేసుకొండి. 


Published Sep 26, 2025 05:18:00 PM
postImages/2025-09-26/1758887371_bankholidays.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 2025 అక్టోబర్ నెలలో ఏకంగా 19 రోజుల పాటు బ్యాంకులకు సెలవు వచ్చాయి. ఈ హాలిడేస్ లో బ్యాకింగ్ పనులు ఏమైనా ఉంటే సెలవులు చూసుకొని ప్లాన్ చేసుకొండి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్ బీఐ ) 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 19 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని నేషనల్ హాలిడేస్ . మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని మీరు ప్లాన్ చేసుకొండి. 


అక్టోబర్ 1 : దసరా, ఆయుధ పూజ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్​, పశ్చిమ బెంగాల్​, బిహార్​, ఝార్ఖండ్​, మేఘాలయ, నాగాలాండ్​, త్రిపుర, అరుణాచల్​ప్రదేశ్​ల్లో ఇవి బ్యాంక్ హాలిడేస్.


అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.


అక్టోబర్ 3:  దుర్గాపూజ సంధర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 4 : దుర్గా పూజ సందర్భంగా సిక్కింలోని బ్యాంకలకు సెలవు.


అక్టోబర్ 6 : లక్ష్మీపూజ సందర్భంగా త్రిపుర, వెస్ట్​ బెంగాల్​లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతి , కుమార పూర్ణిమ సంధర్భంగా కర్ణాటక , ఒడిశా , చంఢీగఢ్ , హిమాచల్ ప్రదేశ్ లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 10 : కర్వా చౌత్​ సందర్భంగా హిమాచల్​ప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 20 : దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ : దీపావళి గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ సంధర్భంగా మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , ఒడిశా , సిక్కిం , మణిపూర్ జమ్ము శ్రీనగర్ లోని బ్యాంకులకు సెలవులు.


అక్టోబర్ 27 : చత్​ పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్​, బిహార్​, ఝార్ఖండ్​లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 28 : చత్​ పూజ సందర్భంగా బిహార్​, ఝార్ఖండ్​ల్లోని బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 31 : సర్దార్​ వల్లభ్​ బాయి పటేల్​ జయంతి సందర్భంగా గుజరాత్​లోని బ్యాంకులకు సెలవు.


ఈ సెలవు రోజులు చూసుకొని ఆన్ లైన్, ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 19 రోజులు బ్యాంక్ సెలవులు వస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india bank-jobs bank-holiday

Related Articles