Viral : నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

 

దేశంలో నిత్యం ఏదో ఒక చోట వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా యూపీలో ఓ వింత చోటు చేసుకుంది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు తలలతో ఓ శిశువు జన్మించాడు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721663275_4legs.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. యూపీలోని సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా అనే గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో పూనమ్ అనే మహిళ ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు ముఖాలు ఉన్నాయి.

నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన శిశువును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాస్పిటల్ కు బారులు తీరారు. బాలుడిని చూసిన జనాలు అతడు దైవాంశ సంభూతమని కొందరంటుంటే.. జన్యు లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని మరికొందరు అంటున్నారు. జన్యు లోపం వల్ల తరచూ ఇలాంటి శిశువులు జన్మించడం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : viral viral-news uttarpradesh latest-news

Related Articles