2022లో టైర్ సాంప్సన్ అనే బాలుడు తన ఫుట్‌బాల్ టీమ్‌తో కలిసి ఓర్లాండ్‌లోని ఐకాన్ పార్క్ వెళ్లాడు. అక్కడ సాంప్సన్ ఫ్రీ ఫాల్ టవర్ ఎక్కాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికాలోని ఓర్లాండ్ లో ఓ పార్క్ కు వెళ్లాడు ఓ 14 యేళ్ల కుర్రాడు . అక్కడ ఫ్రీ ఫాల్ టవర్ నుంచి పడి చనిపోయాడు . అయితే మృతుడు కుటుంబం ఫ్లోరిడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కొడుకు ప్రమాదవశాత్తు చనిపోలేదని పరిమితికి మించిన ఎత్తు నుంచి ఫ్రీ ఫాల్ ను ఉపయోగించడంతో తను చనిపోయాడని తెలపడంతో కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.
2022లో టైర్ సాంప్సన్ అనే బాలుడు తన ఫుట్‌బాల్ టీమ్‌తో కలిసి ఓర్లాండ్‌లోని ఐకాన్ పార్క్ వెళ్లాడు. అక్కడ సాంప్సన్ ఫ్రీ ఫాల్ టవర్ ఎక్కాడు. 400 ఫీట్ల ఎత్తు ఉంటే ఆ ఫ్రీ ఫాల్ టవర్ సింగిల్ రైడ్‌లో 129 కేజీల బరువు మాత్రమే మోయగలదు. కాని సాంప్సన్ 173 కేజీలు బరువు ఉన్నాడు. బరువు ఎక్కువగా ఉన్నా ...రూల్స్ పాటించకుండా రైడ్ కు పంపినందుకు కోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాదు రైడ్ సమయంలో టవర్ 70 ఫీట్ల ఎత్తులో ఉండగా సాంప్సన్ పెట్టుకున్న సీట్ బెల్ట్ ఊడిపోయింది. దీంతో సాంప్సన్ 70 అడుగుల పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. 'కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లే సాంప్సన్ మృతి చెందారు. రైడ్‌కు సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే ఎక్కువగా దృష్టిసారించారు.
అక్కడి నిర్వాహక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భావించిన కోర్టు మృతుడి కుటుంబ సభ్యులకు 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే తల్లి తండ్రికి విడివిడిగా 13,12 కోట్లు చొప్పున అందించనున్నారు. ఈ వార్త ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.