ఎక్కడో రచ్చ చేస్తే పోనీలే అని వదిలేసేవారే. ఏకంగా పోలీస్ స్టేషన్ స్టేషన్ లో దుకాణం పెడితే ఎట్లా..చెప్పండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో సమానహక్కులు కోసం పోరాడే వారి కంటే సమానంగా మందు బాటిల్స్ పట్టే ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. అది పెద్ద విషయం కాదు. హైదరాబాదులో ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ చేసింది. అవును నేను తాగాను...బరా బర్ తాగుతా ఏం చేస్తారంటు రచ్చ లేపింది. ఎక్కడో రచ్చ చేస్తే పోనీలే అని వదిలేసేవారే. ఏకంగా పోలీస్ స్టేషన్ స్టేషన్ లో దుకాణం పెడితే ఎట్లా..చెప్పండి.
మహిళ ఉప్పల్ రామంతపూర్ లోని వివేక్ నగర్ నివాసిగా గుర్తించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. మద్యం మత్తులో ఇతరులను దూషించడం, తిరిగి వారిపైనే ఫిర్యాదు చెయ్యడం వారిపైనే కేసులు వెయ్యడం ఆ మహిళకు అలవాటే అంటూ చాలా లైట్ తీసుకున్నారు పోలీసులు.
ఈ ఘటన అంతా ..ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు మద్యం మత్తులో వచ్చిన ఆ మహిళ... పీఎస్ లో హంగామా సృష్టించింది. బ్రీత్ ఎనలైజర్ తో పాటు పోలీసులతో కూడా పిచ్చి పిచ్చిగా ఆడుకుంది. చెప్తూనే ఉదండి అని చెబుతూ పోలీసులకు చిరాకు తెప్పిచింది. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. కామెంట్లు మాత్రం క్రేజీ ఉన్నాయి. తాగిన క్వార్టర్ మందుకు ఇంత రచ్చ అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
'అవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి'
అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. మద్యం తాగి ఠాణాకు వచ్చిన ఆమెను బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. ఊదమంటే ఊదకుండానే 'కోటర్ తాగి వచ్చిన. ఇంక… pic.twitter.com/K9rxmslCmR — TV5 News (@tv5newsnow) December 2, 2024