2022 వరకు రాయగడలోనే ఉండేవారు ఈ మధ్యే రాయగడ నుంచి విశాఖకు చేరుకున్నారు..అక్కడే పీఎం పాలెం లో ఉంటున్నారు. వచ్చిన దగ్గరి నుంచి అన్ని పనులు మానుకొని చాటింగ్ లో ముగినిపోయేది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏంటో పాడుప్రపంచం ఇంత విలువైన జీవితాన్ని దేనికి వాడాలో తెలీడం లేదు. జస్ట్ ఇన్ స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే ...వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమంత్ రెడ్డి, భార్య నాలుగేళ్ల కుమార్తెతో కలిసి విశాఖ పీఎం పాలెంలో నివాసముంటున్నారు. భార్య అసలు ఊరు ఒడిస్సాలోని రాయగడ. 2022 వరకు రాయగడలోనే ఉండేవారు ఈ మధ్యే రాయగడ నుంచి విశాఖకు చేరుకున్నారు..అక్కడే పీఎం పాలెం లో ఉంటున్నారు. వచ్చిన దగ్గరి నుంచి అన్ని పనులు మానుకొని చాటింగ్ లో ముగినిపోయేది.
డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న హేమంత్ రెడ్డి.. భార్యతో అన్యోన్యంగానే ఉండేవాడు. అయితే గత కొంతకాలంగా అతడి భార్య సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం కేటాయించడంతో పాటు.. చాటింగ్ చేస్తుండటంతో ఆమెను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య రోజు గొడవలు జరిగేవి. ఇక ఈ సారి గొడవ జరిగే సమయంలో భర్త ఇన్ స్టా గ్రామ్ ను అన్ ఇస్టాల్ చేసేశాడు. దీంతో ఆ అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ జరిపిస్తున్నారు. ఆమె శవాన్ని కేజీహెచ్ కు తరలించారు.