AKHANDA: 'అఖండ 2' అఫీషియల్ అనౌన్స్​మెంట్ - బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే !

అయితే ఈ సినిమా అఖండ 2నా లేదంటే కొత్త సినిమానా అనేది చాలా రోజులుగా సస్పెన్స్​లో పెట్టారు మేకర్స్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్​.


Published Oct 16, 2024 11:51:00 AM
postImages/2024-10-16/1729059731_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ లో కొన్ని కాంభినేషన్లు భలే క్రేజీ గా ఉంటాయి. వారు ఎన్ని సార్లు కలిసి చేసినా వాళ్ల కాంభినేషన్ మాత్రం సూపర్ డూపర్ హిట్ట్ అవుతుంది.  అలాంటి కాంభినేషనే బాలకృష్ణ - బోయపాటిల కలియిక . వీళ్ల సినిమా వస్తుందంటే చాలు ...మాగ్జిమమ్ హిట్టు సినిమా.  ఇప్పటి వరకు వచ్చిన  సినిమాల్లో అన్నీ సూపర్ హిట్లే. 'సింహ', 'లెజెండ్‌', 'అఖండ' మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ బ్లాక్​ బస్టర్స్​ను అందుకుని ఆడియెన్స్​ను ఓ ఊపు ఉపేశాయి. నాలుగో సారి హిట్టు కి రెడీ గా ఉన్నారు. ఈ కాంబో .


అయితే ఈ సినిమా అఖండ 2నా లేదంటే కొత్త సినిమానా అనేది చాలా రోజులుగా సస్పెన్స్​లో పెట్టారు మేకర్స్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్​. అఖండ 2 అని కన్ఫామ్ చేశారు. అఖండ 2 - తాండవం పేరుతో సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్లు తెలిపారు.టైటిల్ పోస్టర్ ను నిర్మాణ సంస్థ రిలీజ్ చేశారు. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది.14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , నిర్మిస్తున్నారు. ఈ మూవీకి బాలయ్య కూతురు తేజస్విని కూడా కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు.


గతంలో "అఖండలో పసిబిడ్డ, ప్రకృతి. పరమాత్మ కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు" అని తెలిపారు దర్శకుడు బోయపాటి. ఈ కాంభినేషన్ కు బాలయ్య ఫ్యాన్స్ లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇది బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna boyapati-srinu akhanda2

Related Articles