దీంతో కలర్ చూడకుండా ఎందుకు కట్టారంటు మండిపడిన ఎమ్మెల్యే సంసుల్ హుడా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అస్సాం లో ఓ ఎమ్మెల్యే బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఉద్యోగిపై ఓ ఎమ్మెల్యే చేయిచేసుకున్నాడు. పాపం ఆ ఉద్యోగి ఎమ్మెల్యే చెయ్యి చేసుకున్నా ...ఏం చెయ్యలేక సైలెంట్ గా ఉన్నాడు. ఇంతంకీ ఎందుకు కొట్టాడంటే అసోంలోని బిలాసిపర నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి వచ్చారు. అయితే అక్కడ రిబ్బన్ కట్ చేయడానికి ఎమ్మెల్యే సిధ్ధం గా ఉన్నాడు. తీరా చూస్తే రెడ్ రిబ్బన్ బదులు పింక్ రిబ్బన్ కట్టి ఉంచారు.
పింక్ రిబ్బన్ ఎందుకు కట్టారని, సదరు బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో కలర్ చూడకుండా ఎందుకు కట్టారంటు మండిపడిన ఎమ్మెల్యే సంసుల్ హుడా... ఆ ఉద్యోగి చొక్కా పట్టుకుని ముందుకు లాగి చెంప చెళ్లుమనిపించాడు. అక్కడ తోరణాలు కట్టేందుకు తీసుకొచ్చిన అరటిబోదెను అందుకొని ఆ ఉద్యోగిపై దాడి చేశాడు . ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
ये असम के विधायक #समसुल हुदा है
चुनाव के समय कर्मठ, सुशील ,जुझारू बोलते हैं विधायक बनने के बाद जनता को ही रेलते हैं। pic.twitter.com/B5xCqbcu8f — Rinku Gautam (@RinkuGautam38) March 20, 2025