అసలు ఆ మోసానికి బంధువులు ...చుట్టుప్రక్కల వాళ్లు పెళ్లికొడుకు మీద తెగ జాలి పడ్డారంటే నమ్మండి. ఇంతకీ ఏం జరిగిందంటే
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఎన్నో మోసాలు చూశాం కాని ...ఇలాంటి మోసం ఎక్కడా చూడలేదు. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లోని ఓ పెళ్లి కొడుకు కి పెద్ద మోసం జరిగింది. అసలు ఆ మోసానికి బంధువులు ...చుట్టుప్రక్కల వాళ్లు పెళ్లికొడుకు మీద తెగ జాలి పడ్డారంటే నమ్మండి. ఇంతకీ ఏం జరిగిందంటే
ఉనా జిల్లాలోని నారీ గ్రామానికి చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఏదో ఓ కారణంతో సంబంధం కుదరడంలేదు. చివరకు దగ్గరి బంధువు రూ.50 వేలు తీసుకుని ఓ సంబంధం కుదిర్చిపెట్టింది. పిల్ల ఫొటో చూసి మనసుపారేసుకున్న అబ్బాయి ..ఫోన్ లో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. యువతి చాలా కంగారు పెట్టడం తో పెళ్లి ముహూర్తానికి అన్ని సెట్ చేసుకున్నాడు. తీరా యువతి స్వస్థలానికి బాజా భంజంత్రీలతో వెళ్తే ఆ ఊరి వాళ్లు గ్రామం మొదట్లోనే ఆపేశారు.
ఈ బృందాన్ని చూసి సింగా గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు గ్రామంలో ఎవరింట్లోనూ శుభకార్యం జరగడంలేదని తేల్చిచెప్పారు. అంతేనా పెళ్లి కూతురు అసలు తమ ఊరే కాదని చెప్పారట. పెళ్లి బృందం ఆశ్చర్యపోయింది. బంధువులేగా సంబంధం కుదిర్చింది..ఏంటి ఇది అని అడిగితే ...పొంతన లేని సమాధానాలు చెబుతుందట. ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్దే తేల్చుకుంటామని పెళ్లి బృందం వాపస్ వెళ్లిపోయింది. ఈ మోసంపై నారీ గ్రామ పెద్దలు చర్చించి పెళ్లి సంబంధం కుదిర్చిన బంధువును బాధ్యురాలిగా తేల్చి, పెళ్లి కోసం చేసిన రూ.5.86 లక్షలు కట్టాలని తీర్పు చెప్పారు.