బిగ్ బాస్ సీజన్ 8 చాలా వెరైటీగా కొనసాగుతోంది. ఇంతకు ముందు సీజన్స్ లో ఒక లెక్క ఈ సీజన్ మరో లెక్క. ప్రతిదీ మార్చేశారు. ఇంతకుముందు నాగార్జున ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా అడిగి వారి తప్పులను
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 చాలా వెరైటీగా కొనసాగుతోంది. ఇంతకు ముందు సీజన్స్ లో ఒక లెక్క ఈ సీజన్ మరో లెక్క. ప్రతిదీ మార్చేశారు. ఇంతకుముందు నాగార్జున ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా అడిగి వారి తప్పులను బయటపెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా కంటెస్టెంట్లే ఒకరికొకరు వారి తప్పులను బయటపెట్టి సర్ది చెప్పాలి. అలాంటి బిగ్ బాస్ సీజన్ ఈ వారం మూడు గొడవలు, ఆరు కొట్లాటలుగా సాగింది. మొదటి వారం నుంచి ఎలిమినేషన్ లో విపరీతమైనటువంటి గొడవలు పెట్టుకున్నారు. టాస్కులు ఆడే సమయంలో కూడా ఒకరికొకరు గట్టిగానే పోట్లాడారని చెప్పవచ్చు.
ఇక నామినేషన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో నిలిచారు. నామినేషన్ లో శేఖర్ భాష, సోనియా, విష్ణు ప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, బెజవాడ బేబక్క ఉన్నారు. మరి నామినేషన్ అయిన వారిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. మనకు అందిన సమాచారం ప్రకారం ఈసారి ఆవిడే ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే నిన్నటి వరకు ఈ వారం యాంకర్ విష్ణు ప్రియ ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు.
ఆ తర్వాత ప్లేస్ లో మణికంఠ ఉంటారని, హౌస్ లో ఉన్న వారంతా మణికంఠనే నామినేట్ చేశారు. దీంతో మణికంఠ కాస్త ఎమోషనల్ అయిపోయి జనాల్లో సింపతి పెంచుకున్నాడు. దీంతో ఆయన ఓటింగ్ లో టాప్ ప్లేస్ లోకి వచ్చాడు. ఇదే క్రమంలో యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ కూడా అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పృథ్వి 3వ స్థానం, శేఖర్ భాష ఐదవ స్థానంలో ఉండగా సోనియా మరియు బేబక్క ఓటింగ్ లో కాస్త అటు ఇటుగా ఉన్నారు. కానీ చివరి సమయంలో సోనియా ఓటింగ్ కూడా అనూహ్యంగా పెరిగిందట. దీంతో ఓటింగ్ లో చాలా వరకు వెనుకబడిపోయిందట బెజవాడ బేబక్క. దీంతో ఈవారం బేబక్క ఎలిమినేట్ అవ్వనున్నట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.