Bigg Boss 8 : అయ్యోయ్యో..బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ మారిపోయిందే !

బిగ్ బాస్ టీంకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయట.ఇప్పటి వరకు మనం గెస్ కొట్టిన వాళ్లెవరు స్క్రీన్ మీదకు వస్తున్నారా


Published Aug 26, 2024 12:18:00 PM
postImages/2024-08-26/1724654924_newproject20240328t0006369961711565652.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ నుంచి కాల్ రావడంతో పాటు ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ నుంచి టెలీ కాస్ట్ కూడా అంటున్నారు. ఇంకా కంటెస్టెంట్స్ పై గెస్ కొట్టడం మాత్రం అవ్వడం లేదు. కొంతమంది బిగ్ బాస్ కు ఓకే అయితే కంటెస్టెంట్స్ ఓకే కాదు. కంటెస్టెంట్ ఓకే అంటే బిగ్ బాస్ నో చెప్పినవాళ్లు చాలా మంది ఉన్నారు.
 బిగ్ బాస్ వల్ల అమర్ దీప్‌కి అంత డ్యామేజ్ అయిన తరువాత కూడా.. అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్‌ 8కి వెళ్తుందట..బిగ్ బాస్ జాతకాలు చెప్పే సోషల్ ఇన్ఫ్లయెన్సర్స్ అంతా ముక్త కంఠంతో తేజశ్విని గౌఢ పేరును అనౌన్స్ చేసేశారు. కాని అమ్మడు మాత్రం స్టిల్ థింకింగ్. మేడం ఏం చేస్తుందో ఇంకా చెప్పలేం.


వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్‌కి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేశారు బిగ్ బాస్ మేకర్స్. యాదమరాజు, మై విలేజ్ షో అనిల్, బర్రెలక్క, కుమారి ఆంటీ వీళ్లని బిగ్ బాస్ జస్ట్ చూశారంతే ...కంటెస్టెంట్స్ గా ఓకే చెప్పలేదు పెద్దన్న.సెప్టెంబర్ 01 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఆట ప్రారంభం కాబోతుందని ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఫైనల్ లిస్ట్ ఇంకా సిధ్దం కాలేదని టాక్. పాపం లిస్ట్ రెడీ చేసుకున్నాక ...ఎక్కువ రిఫరెన్స్ లు వచ్చాయట. గ్లామర్ ను ఆరాధించేవాళ్లు ఇండస్ట్రీ లో ఎక్కువ కదా..సో ఎవరికి నచ్చిన అందాన్ని వాళ్లు రిఫర్ చేశారట. దీంతో బిగ్ బాస్ టీంకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయట.ఇప్పటి వరకు మనం గెస్ కొట్టిన వాళ్లెవరు స్క్రీన్ మీదకు వస్తున్నారా లేదా అనేది చూసి తెలుసుకోవడమే. ఇఫ్పుడు షో మరింత మజా వస్తుంది. చివరి వరకు మంచి సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తారు.
అయినా కాస్త అటు ఇటుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి..వాళ్లెవరో చూద్దాం.

1. రీతూ చౌదరి (యాంకర్)
2. విష్ణు ప్రియ (యాంకర్)
3. సౌమ్యరావ్ (యాంకర్)
4. నిఖిల్ (సీరియల్ నటుడు)

5. అంజలి పవన్ (వైల్డ్ కార్డ్ ఎంట్రీ)
6. ఊర్మిల చౌహాన్ (మోడల్)
7. బెజవాడ బేబక్క (యూట్యూబర్)
8. యష్మీ గౌడ (కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్)
9. సాకేత్ (సింగర్)
10. యాక్టర్ ఖయ్యూం (అలీ సోదరుడు)
11. యాక్టర్ అభిరామ్ వర్మ (రాహు సినిమా హీరో)
12. సోనియా సింగ్ (నటి, యూట్యూబర్)వీరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంత మంది కన్ఫర్మ్ తెలీదు కాని ఆ నోట ఈ నోట వినిపిస్తున్న పేర్లు.వీళ్లలో ఎంత మంది వస్తారో...ఎంతమంది పక్కనుంటారో తెలీదు కాని ప్రస్తుతానికి ఇండస్ట్రీ లో నలుగుతున్న పేర్లు ఇవే.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu contestents bigboss8

Related Articles