Bigg Boss 8: శేఖర్ భాషా ఎలిమినేషన్..రెండు వారాలకు రెమ్యూనిరేషన్ ఎంతంటే ?

తన కామెడీతో, పంచులతో హౌస్ మెంట్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. రోజురోజుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతూ వచ్చాడు. సరైన ఆటలో పడుతున్నాడనే టైంకి బయటకు వచ్చేశాడు.


Published Sep 18, 2024 12:51:00 PM
postImages/2024-09-18/1726644364_RJShekarBasha9.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బుల్లితెర మెగా రియాలిటీ షో బిగ్ బాస్ 8 నుంచి మరో క్యాండిడేట్ బయటకు వెళ్లిపోయారు. అసలు ఈ శేఖర్ భాష రెమ్యూనిరేషన్ గురించే ఇప్పుడు వార్తలన్నీ. ఎంత తీసుకొని ఉంటారు. బిగ్ బాస్ 8లో ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేషన్ ను ఎవ్వరూ ఊహించలేదు. తన కామెడీతో, పంచులతో హౌస్ మెంట్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. రోజురోజుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతూ వచ్చాడు. సరైన ఆటలో పడుతున్నాడనే టైంకి బయటకు వచ్చేశాడు.


ఎంత బిగ్ బాస్ అయితే మాత్రం మరీ నవ్వులు , కామెడీ లేకపోతే ...ప్రాణానికి విసుగురాదా..అలా గేమ్స్ తో అలిసిపోయిన వారికి అలీభాషా కాస్త కామెడీతో ఫన్ క్రియేట్ చేసేవాడు. ఇప్పుడు అదీ లేదు. గొడవలతో కొట్టుకుచస్తారు. అయితే ఈ రెండు వారాలకు గాను శేఖర్ భాషా ఐదు లక్షలు సంపాదించారు.అంటే వారానికి దాదాపు 2.5 లక్షలు.


 దాంతో తక్కువ రోజులకే ఎక్కువ మెుత్తం బానే వెనకేశాడే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఉండి ఉంటే బాగుండేదంటున్నారు. ఇటీవలే శేఖర్ భాషా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ టైంలో భార్యకు సపోర్ట్ గా ఉండడమే మంచిదంటున్నారు మరికొందరు.అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇది చాలా మంచి టైం శేఖర్ భాషా తన ఫ్యామిలీ టైం ను ఎజాయ్ చేస్తారంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigboss8 remuniration

Related Articles