ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కమిటీ కుర్రోళ్ళు మూవీ గురించే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ చిత్రం అద్భుత విజయం దిశగా అడుగులు వేసింది.
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కమిటీ కుర్రోళ్ళు మూవీ గురించే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ చిత్రం అద్భుత విజయం దిశగా అడుగులు వేసింది. అంతేకాదు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ కొత్తవాళ్లే. వారందరికీ ఈ మూవీ ఎంతో పేరు తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. అలాంటి "కమిటీ కుర్రోళ్ళు" సినిమాని యాదు వంశీ దర్శకుడిగా చేశాడు.
అంతేకాదు నిహారిక కొనిదెల నిర్మాతగా వ్యవహరించింది. ఈ విధంగా అన్ని హంగులు కలగలుపుకొని రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. అయితే ఈ సినిమాను మహేష్ బాబు మురారి చిత్రం కాస్త ఇబ్బంది పెట్టిన దాన్ని కూడా తట్టుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏడు కోట్ల 48 లక్షల గ్రాస్ సాధించి లాభాల్లోకి వెళ్లిపోయింది.
కేవలం నాలుగు రోజుల్లోనే ఇంతటి ఘనత సాధించిందంటే రాబోవు రోజుల్లో ఇంకెంత దూరం వెళుతుందో మనందరం చూడాలి. ఈ విధంగా హిట్ సాధించడంతో కొత్త దర్శకుడుని మరియు కొత్త నటులకు, నిర్మాత నిహారికకు చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా గురించి స్పందించి ఈ చిత్రం చూస్తానని సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోందని అన్నారు.