అక్కినేని ఫ్యామిలీని చుట్టిన వివాదాలు..కారణం శాపమేనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీ ఓ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ


Published Oct 04, 2024 07:50:00 PM
postImages/2024-10-04/1728050517_AKKINENIFAMILY.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీ ఓ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో నిలబడింది అంటే దానికి ఒక పిల్లర్ అక్కినేని అని కూడా చెప్పవచ్చు. ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు తన ఫ్యామిలీని కూడా ఎంతో ఎదిగేలా చేశారు. అలాంటి అక్కినేని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నటన రంగంపై ఉన్న అభిలాషతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు.

 దాదాపుగా 300కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తించే నటుల్లో ఒకరిగా మారారు. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అలా ఆయన ఒక్కడు ఎదగడమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చి తన ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీలో ఇతర రంగాల్లో ఎదిగేలా చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా అక్కినేని నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నాగార్జున స్టార్ డం తెచ్చుకున్నారు. ఇక తన రెండవ కొడుకు వెంకట్ కూడా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో సంపాదించారు. ఇలా వీరి ఫ్యామిలీ  వెలు సెట్ అయినా కానీ నాగేశ్వరరావు కుటుంబం నుంచి వచ్చిన మన వాళ్ళు మాత్రం అస్సలు సెట్ కావడం లేదు.

వారి సినిమాల విషయంలో కానీ పెళ్లిళ్ల విషయంలో కానీ అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. నాగచైతన్య సమంతాని పెళ్లి చేసుకొని విడిపోయారు. అఖిల్ కు పెళ్లి ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయింది. ఇలా పెళ్లిళ్ల విషయమే కాకుండా ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేత ఇలా అనేక వివాదాలు వీరిని చుట్టుముడుతున్నాయి.  అక్కినేని ఫ్యామిలీనే ఈ వివాదాలు చుట్టుముడుతుండడంతో  అక్కినేని ఫ్యామిలీకి ఏదో దోషం ఉందని, ఏదో శాపం వెంటాడుతుందని దానిపై వారు పరిహారం చేయించుకోవాలని కొంతమంది  శాస్త్రం తెలిసిన వారు కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna nagachaitanya akhil-akkineni amala anr akkineni

Related Articles