Devara Glimpse: దేవర నుంచి సరికొత్త గ్లింప్స్..!

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్  గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి అతిపెద్ద భారీ బడ్జెట్ మూవీ దేవర. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన


Published Aug 16, 2024 07:44:34 AM
postImages/2024-08-16/1723806811_devera12.jpg

న్యూస్ లైన్ డెస్క్:పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్  గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి అతిపెద్ద భారీ బడ్జెట్ మూవీ దేవర. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన కథానాయికగా  బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ చేస్తోంది. అలాంటి ఈ చిత్రంపై   భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయినటువంటి పోస్టర్, సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి.

ఈ మూవీకి సౌత్ లో మంచి హైపు వస్తున్నప్పటికీ మేకర్స్ అన్ని వైపుల నుంచి వీలైనంత ఎక్కువ ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అలాంటి ఈ భారీ బడ్జెట్ మూవీకీ సంబంధించి తాజాగా మూవీ మేకర్స్  గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, సైఫ్ అలీ ఖాన్, భైర గెటప్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ గ్లింప్స్ భయంకరంగా ఉంది. అయితే ఈ చిత్రంలో ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన  సీన్స్ కూడా హైలెట్ అవ్వబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో అద్భుతంగా ఆదరణ పొందుతోంది.

newsline-whatsapp-channel
Tags : viral-news jr-ntr devara johnvi-kapoor baira

Related Articles