Devara : రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే సాంగ్ !

జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు. రీసెంట్ చుట్టమల్లే సాంగ్ ను రిలీజ్ చేసింది టీం. ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.


Published Aug 07, 2024 08:39:00 AM
postImages/2024-08-07/1723000293_devra.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు. రీసెంట్ చుట్టమల్లే సాంగ్ ను రిలీజ్ చేసింది టీం. ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 5న విడుదలైన దేవర చుట్టమల్లే పాటకు అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్‌తో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది.


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ,వసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా మేకింగ్ జరుగుతుంది. 


"చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌, అందులోని విజువ‌ల్స్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు పెద్ద ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్ లుక్స్ , జాన్వీ కపూర్ గ్లామర్ కిల్లింగ్ గా అనిపించింది. ఇద్దరి జోడీ మ్యూజిక్ కి తగినట్లు డ్యాన్స్ చేయడం పాటకు మరింత అందంగా అనిపించింది. విడుదలైన 19 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ వ్యూస్ సాధించుకుంది. అలాగే యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ పాట. 


తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన చుట్టమల్లే పాటలోని లొకేషన్స్, తారక్-జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయ్యింది. కాగా ఈ పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తూనే క‌ళ్లు తిప్పుకోనీయ‌ట్లేదు. అనిరుద్ ర‌విచందర్ మ్యూజిక్ లో ఈ సాంగ్ బెస్ట్ అవ్వచ్చు. శిల్పా రావ్ పాట‌ను తన గొంతుతో మెస్మరైజ్ చేసేసింది.


‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. ఆది తర్వాత ఆ రేంజ్ యాక్షన్ సీన్స్ ను అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ . సినిమా రిలీజ్ రోజు చూడాలి..ఫ్యాన్స్ హడావిడి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara devara-second-song

Related Articles