భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే అంబానీ కుటుంబమే. ముఖేష్ అంబానీ రెండవ కొడుకు వివాహం జూలై 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి మిత్రురాలు రాధిక మర్చంట్ ను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే అనంత్ అంబానీకి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ఆయన విపరీతమైనటువంటి ఉబకాయంతో బాధపడుతున్నారు. ఇవన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.వారు చిన్నప్పటి నుంచి లవ్ లో ఉండడమే అని తెలుస్తోంది. మరి అనంత్ అంబానీకి ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే అంబానీ కుటుంబమే. ముఖేష్ అంబానీ రెండవ కొడుకు వివాహం జూలై 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి మిత్రురాలు రాధిక మర్చంట్ ను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే అనంత్ అంబానీకి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ఆయన విపరీతమైనటువంటి ఉబకాయంతో బాధపడుతున్నారు. ఇవన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.
వారు చిన్నప్పటి నుంచి లవ్ లో ఉండడమే అని తెలుస్తోంది. మరి అనంత్ అంబానీకి ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. అయితే అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనంత్ కు తీవ్రమైన ఉబ్బసం ఉన్నందున, మేము చాలా స్టెరాయిడ్స్ ఇప్పించవలసి వస్తోందని చెప్పారు. దీనివల్ల ఆయన విపరీతంగా బరువు పెరుగుతున్నాడని, అనంత్ అంబానీ చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. అంతకుముందు ఆయన 200 కిలోల కంటే ఎక్కువ బరువు పెరిగాడని , ఎన్నో కసరత్తులు చేసి కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడంతో వార్తల్లో నిలిచారు.
ఆయన బరువు తగ్గడం కోసం రోజుకు ఐదు నుంచి 6 గంటల పాటు కసరత్తులు చేసేవాడట. ఇందులో ముఖ్యంగా యోగశిక్షణ, బరువు తగ్గే శిక్షణ, 21 కిలోమీటర్ నడక, కార్డియో అన్ని కవర్ చేసేవాడట. అలాగే అధిక ప్రోటీన్, చక్కెర లేని ఆహారం తక్కువ కొవ్వున్నటువంటి ఫుడ్ తీసుకొని కేవలం 18 నెలలు కసరత్తులు చేసి అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చారు. ఆయన స్టెరాయిడ్స్ కూడా వాడడం వల్ల విపరీతమైనటువంటి ఆకలి పెరుగుతుందట. దీంతో సాధారణం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారట. దీనివల్లే ఎక్కువ బరువు పెరిగి అనేక సమస్యలకు దారితీస్తుందట.
అయితే ఆయనకు ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉందని తెలిసి కూడా రాధిక వివాహం చేసుకుంది.దీనికి ప్రధాన కారణం వారు చిన్నతనం నుంచే మంచి స్నేహితులు. రాను రాను వీరి స్నేహం ప్రేమగా మారింది. అంతేకాదు అనంత్ అంబానీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు రాధిక మర్చంట్ పక్కనే ఉండి తనకు సపోర్ట్ గా నిలిచింది. ఈ విధంగా అనంత్ రాధిక మర్చంట్ లు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. చివరికి వీరు పెళ్లి ద్వారా ఒక్కటైపోయారు.