అనంత్ అంబాని పెళ్లి చేసిన పండితుడికి ఇంత దక్షిణ ఇచ్చారా.?

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం జూలై 12వ తేదీన ముంబై నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ఆకాశమంత పందిరి భూదేవంత  సందడి అన్నట్టుగా ఆయన వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు  ఎంతోమంది స్వదేశీయులతో పాటు, విదేశీయులు   కూడా వచ్చారు.  ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మాన్లు,  దేశాల అధ్యక్షులు రాజకీయ నాయకులు,  ప్రముఖులు సినీ స్టార్స్, స్పోర్ట్స్ రంగాలలో ఉన్నవారు ఇలా ఒక్కరేమిటి ప్రపంచ దేశంలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు వివాహానికి హాజరయ్యారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721057899_sharma.jpg

న్యూస్ లైన్ డెస్క్: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం జూలై 12వ తేదీన ముంబై నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ఆకాశమంత పందిరి భూదేవంత  సందడి అన్నట్టుగా ఆయన వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు  ఎంతోమంది స్వదేశీయులతో పాటు, విదేశీయులు   కూడా వచ్చారు.  ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మాన్లు,  దేశాల అధ్యక్షులు రాజకీయ నాయకులు,  ప్రముఖులు సినీ స్టార్స్, స్పోర్ట్స్ రంగాలలో ఉన్నవారు ఇలా ఒక్కరేమిటి ప్రపంచ దేశంలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు వివాహానికి హాజరయ్యారు.

 అయితే ఈ వేడుకకు వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముకేశ్ అంబానీ ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వేలాదిమంది అతిధుల మధ్య వీరి వివాహం అద్భుతంగా జరిగింది. అలాంటి  అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం చేసిన  పండితులు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన పెళ్లి చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ వేడుకను శాస్త్రృక్తంగా  నిర్వహించారు పండితులు చంద్రశేఖర్ శర్మ. ఈయన అంబానీ కుటుంబంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా తప్పకుండా వస్తారట. ఈయన పూజారి మాత్రమే కాక, జ్యోతిష్య శాస్త్రంలో కూడా మంచి పేరు పొందారట.

చంద్రశేఖర్ శర్మకు విమానాశ్రయంలో అంబానీ కుటుంబ సభ్యులంతా ఘన స్వాగతం పలికారు.  అయితే అంబానీ ఇంట్లో జరిగే వినాయక వేడుకనుంచి మొదలు ప్రతి ఒక భక్తి వేడుకలను చంద్రశేఖర శర్మ గారే నిర్వహిస్తారట. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ పిక్ లో చంద్రశేఖర్ శర్మ కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది.  ఈయన కేవలం పూజారి మాత్రమే కాదు. లైఫ్ స్టైల్ మోటివేటర్, పర్సనల్ కోచ్  అని తెలుస్తోంది. అలాంటి ఈ వివాహ వేడుకకు  చంద్రశేఖర్ శర్మకు దాదాపు కోట్ల రూపాయల  దక్షిణగా ఇచ్చినట్టు సమాచారం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige ananth-ambani radhika-marchant chandrashekar-sharma pandithulu

Related Articles