DELHI: ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు...15 నిమిషాల ఊపిరికి ఎంత రేటో తెలుసా ?

చివరాఖరికి ఆక్సిజన్ ను కిలో ల చప్పున అమ్మేస్తున్నారు కూడా. ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు తెరవడం అంటే మామూలు మాటలు కాదు. ప్రపంచం ఎటు పోతుంది. 


Published Nov 28, 2024 07:20:00 PM
postImages/2024-11-28/1732801923_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఆక్సిజన్ బార్...అసలు ఎలాంటి పరిస్థితి వచ్చింది భారత్ కు...ఎలా ఉండేది భారత్ ...ఇప్పుడు అన్ని దేశాలు పచ్చగా ఉంటే మన దేశంమాత్రం పొల్యూషన్ పీహెచ్ డీ చేస్తుంది. మొన్నే ఓ సర్వే తేల్చేసింది. ఢిల్లీలో ఒక్కరోజు ఉంటే 49 సిగరెట్లు కాల్చినంత దారుణంగా ఎయిర్ పొల్యూషన్ ఉందంటుందట. చివరాఖరికి ఆక్సిజన్ ను కిలో ల చప్పున అమ్మేస్తున్నారు కూడా. ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు తెరవడం అంటే మామూలు మాటలు కాదు. ప్రపంచం ఎటు పోతుంది. 


ఢిల్లీలో వాయుకాలుష్యం , ఆక్సిజన్ బార్ , ఆక్సీ ప్యూర్ , ఢిల్లీ వాయు కాలుష్యం , వాయు కాలుష్యం పై ఎన్నో సర్వేలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ లోపల ఉన్న ఆక్సీ ప్యూర్ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను రూ. 299 నుండి అందిస్తుంది. 15 నిమిషాలకు దాదాపు 300 ఛార్జ్ చేస్తుంది. 


ఢిల్లీలోని సాకేత్‌లో ఆర్యవీర్ కుమార్ ఈ ఏడాది మేలో ప్రారంభించిన బార్. ఇది పదిహేను నిమిషాల పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. మీరు 7 విభిన్న సుగంధాలలో మీ ఆక్సిజన్‌ను ఆర్డర్ చేయడానికి ఎంచుకోవచ్చు. పుదీనా, పుదీనా, దాల్చిన చెక్క, నారింజ, లెమన్‌గ్రాస్, యూకలిప్టస్ మరియు లావెండర్ రుచులు అందుబాటులో ఉన్నాయి. ఇలా మీకు నచ్చిన వాటితో స్వఛ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చవచ్చు.


కస్టమర్‌కు ట్యూబ్ ఇవ్వబడుతుంది, దాని ద్వారా వారికి ఫ్లేవర్డ్ ఆక్సిజన్ అందించబడుతుంది. నిజానికి ఈ ఫెసిలిటీ ని 2019 నుంచే స్టార్ట్ చేసినా అంతగా నడవలేదు. కాని ఇఫ్పుడు మాత్రం తెగ నడుస్తుందట. ఇది శరీరాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, రోగనిరోధక వ్యవస్థను బలపరిచేటప్పుడు ఆక్సిజన్ ప్రసరణను పెంచుతుంది . 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by National Capital Delhi (@nationalcapitaldelhi)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pollution delhi oxygen oxygen-bars

Related Articles