ఇంతకీ విషయం ఏంటంటే ఓ వ్యక్తి ఆరు రూపాయిల లాటరీ టికెట్ కొనుక్కున్నందుకు ...1800 కోట్లు లాటరీ వచ్చింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాలం కలిసి రావాలి కాని ఎంతసేపు చెప్పండి..పేదవాడు కోటీశ్వరుడు కావడానికి . అదృష్టం అంతే ...ఒక్కోసారి పట్టిందంటే జిడ్డులాగావదలదు...వరాల మీద వరాలు ఇస్తూనే ఉంటుంది . కాని అలాంటి మ్యాజిక్ లు కొంత మందికే జరుగుతాయి ...మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇంతకీ విషయం ఏంటంటే ఓ వ్యక్తి ఆరు రూపాయిల లాటరీ టికెట్ కొనుక్కున్నందుకు ...1800 కోట్లు లాటరీ వచ్చింది.
లాటరీ తగలడంతో ఏకంగా 177 మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో సుమారు రూ.1,800 కోట్లు. మంగళవారం నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్లకు ఈ బంపర్ లాటరీ తగిలింది. విషయం తెలిసిన వ్యక్తి ఆనందం అంతా ఇంతా కాదు...ఓరీ దేవుడా ఇప్పుడైనా చూశావా తండ్రి అంటూ దండాల మీద దండాలు పెడుతున్నాడట.
బ్రిటన్‌లోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదే. కాగా, 2022 జులై 19న జరిగిన డ్రాలో 195 మిలియన్ పౌండ్లు గెలుచుకున్న విజేత నేషనల్ లాటరీలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇక తాజా విజేత ఈ ఏడాది సండే టైమ్స్ సంపన్నుల జాబితాలోని మ్యుజిషియన్స్ హ్యారీస్టెల్స్ (175 మిలియన్ పౌండ్లు), అడెలె (170 మిలియన్ పౌండ్లు)లను దాటేయడం గమనార్హం. కాగా, విజేత వివరాలను వెల్లడించేందుకు నిర్వాహకులు నిరాకరించారు. అసలే అంత డబ్బు కావడంతో ఆ వ్యక్తి కి రిస్క్ అని గమనించి నిర్వహకులు వివరాలు బయటకు చెప్పలేదట.