Swiggy: కస్టమర్ రిక్వస్ట్ కు ఆఫర్ ప్రకటించిన స్విగ్గీ ..ఏంటా ఆఫర్ !

ఓ గంటపాటు తక్కువ ధరకే ఉల్లిని అమ్మగలమని తెలిపారు. ఇన్ స్టా మార్ట్ లో ఫ్లాష్ సేల్ ఏర్పాటు చేశాడు అది కూడా ఈ రోజే.


Published Nov 30, 2024 01:46:00 PM
postImages/2024-11-30/1732954649_swiggy.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిర్యానీ తో పాటు నాలుగు ఉల్లిపాయ ముక్కలు అదనంగా పంపండి బాబు అంటూ స్వీగ్గీకి ఓ కస్టమర్ అభ్యర్ధి పెట్టుకున్నాడు. పాపం ఆ రిక్వెస్ట్  కి స్విగ్గీ పెద్దోళ్లకి మనసు కరిగిపోయి ...సరే సరే ఇస్తాంలే ఏడవకు అంటూ చెప్పారు. మ్యాటర్ ఏంటంటే.. ఉల్లిపాయలు రేటు తగ్గించలేం కాని మీ కోసం ఓ గంటపాటు తక్కువ ధరకే ఉల్లిని అమ్మగలమని తెలిపారు. ఇన్ స్టా మార్ట్ లో ఫ్లాష్ సేల్ ఏర్పాటు చేశాడు అది కూడా ఈ రోజే.


 ఢిల్లీకి చెందిన ఓ యువకుడు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. మార్కెట్ లో ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి, కొనలేక పోతున్నా ప్లీజ్ ఓ నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా పంపండి అంటూ ఆ రెస్టారెంట్ వాళ్లకు రిక్వెస్ట్ పెట్టాడు. ఆర్డర్ వచ్చాక బిల్లుపై ఈ రిక్వెస్ట్ చూసిన ఆ యువకుడి ఫ్లాట్ మేట్ సరదాగా దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ గా మారింది. ఉల్లిపాయల రేట్లపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.


ఈ పిక్ స్వీగ్గీ కో ఫౌండర్ ఫణి కిషన్ వరకు చేరింది. దీంతో ఆయన రెస్పాండ్ అవుతూ ఉల్లి రేట్లు దారుణంగా ఉండడంపై తాము ఏం  చెయ్యలేమని ..మీ లాంటి వారి కోసం ఈ రోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు ఇన్ స్టా మార్ట్ లో రూ.39 కే కిలో ఉల్లి పాయలు అందిస్తామని కామెంట్ పెట్టాడు. ఈ పిక్ ను షేర్ చేస్తూ ప్రకటించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకు గంటపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, తమ దగ్గర స్టాక్ అయిపోయేలోపే ఆర్డర్ పెట్టుకోండని ఫణి కిషన్ చెప్పాడు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news delhi online

Related Articles