TGSRTC : మా తల్లే ..ఫ్రీ బస్సు ను ఇలా కూడా వాడుకుంటారా !

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ ..ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అనే స్టేట్మెంట్ ఇచ్చే సరికి ఆడవాళ్లు ఆర్టీసీ బస్సును ఉచితంగా ప్రయాణిస్తూ ...ఆఖరికి పుట్టింటికి అలిగి పోవడానికి కూడా ఆర్టీసీనే వాడుతున్నారు.


Published Jul 29, 2024 07:19:09 PM
postImages/2024-07-29//1722260949_FreeBus.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ ..ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అనే స్టేట్మెంట్ ఇచ్చే సరికి ఆడవాళ్లు ఆర్టీసీ బస్సును ఉచితంగా ప్రయాణిస్తూ ...ఆఖరికి పుట్టింటికి అలిగి పోవడానికి కూడా ఆర్టీసీనే వాడుతున్నారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది.


రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.  కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారుకూడా. రీసెంట్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. కొద్దిపాటి దూరానికి కూడా బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఓ మహిళా బస్సులో వెళ్తూ బ్రష్  చేస్తుండడం ఫుల్ వైరల్ అవుతుంది.


ఈ వీడియోలో ఓ మహిళ టీజీఎస్‌ ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చుని ఉండటం చూడొచ్చు. అయితే సదరు మహిళ.. తాపీగా కిటికీ పక్కన సీట్లో కూర్చుని, బయటి వ్యూ చూస్తూ బ్రష్‌ చేస్తూ ఉండటం వీడియోలో కనిపించింది. అంతేనా సిటీల్లో ఆడవాళ్లు నిలుచొని వెళ్లడానికే ..నానా కష్టాలుపడుతుంటే ...ఈవిడ బ్రష్ చేస్తూ వెళ్లడంపై ఫుల్ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. మా తల్లే బ్రష్ చేస్తున్నావా...చెయ్యి తల్లి చెయ్యి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress-government free-bus

Related Articles