కొత్తగా ఎ్కడ నుంచో వచ్చిన ఎలుగుబంట్లను కూడా ప్రేమగా సాకుతాడు అయితే అవి ఇతనిని ఏం అనవు .ముద్దుపేర్లను పెట్టి పిలుస్తూ వాటిని మనుషుల్లానే ఆదరిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలంటే కంపల్సరీ మనసులు కలవాల్సిందే. అందరికి ఒకలా ఉండదుగా. ఒకరు మొక్కల్ని ప్రేమిస్తారు. మరొకరు జంతువులను..మరికొంతమంది మనుషులను ..అసలు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే మాత్రం మనం మనస్పూర్తిగా రిలేషన్ ను చత్తీస్ గఢ్ లో ఓ సన్యాసి ..ఎలుగుబంట్లతో స్నేహం కుదిరింది. తనకు అలవాటు ఉన్నవే కాదు ..కొత్తగా ఎ్కడ నుంచో వచ్చిన ఎలుగుబంట్లను కూడా ప్రేమగా సాకుతాడు అయితే అవి ఇతనిని ఏం అనవు .ముద్దుపేర్లను పెట్టి పిలుస్తూ వాటిని మనుషుల్లానే ఆదరిస్తున్నారు.
2013లో సీతారాం అనే సన్యాసి మధ్యప్రదేశ్‌లోని షహదోల్ నుంచి మనేంద్రగఢ్ చిర్మిర్ భరత్‌పుర్ జిల్లాకు వచ్చారు. అక్కడే ఓ చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఎన్నో ఎలుగుబంట్లు వస్తుంటాయి. వాటిని చాలా ప్రేమగా ఆదరిస్తాడు. ఇఫ్పుడు తను 7 ఎలుగుబంట్లను పెంచుతున్నాడు. వాటికి లల్లి, మున్ను, చన్ను, గుల్లు, సోను, మోను, సత్తానంద్ అని పేర్లు పెట్టారు సీతారాం. రోజు తన దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లకు ఆహారం, నీరు పెడుతున్నారు.
ఎలుగుబంట్లన్నీ 200 మీటర్ల పొడవున్న రాజమడ అనే గుహలో నివసిస్తున్నాయి. చాలా మంది ప్రజలు సన్యాసి దర్శించడంతో పాటు ఈ ఎలుగుబంట్లను కూడా చూడడానికి వెళ్తుంటారు. అయితే అవి వారిని ఏం చెయ్యవంటున్నారు భక్తులు. ఏదైనా ఈ వింత స్నేహం కాస్త భయం కొల్పోలాగే ఉందంటున్నారు మరికొంతమంది.