Tollywood: ; పెళ్లైన వాడితో రొమాన్స్* వల్లే రోడ్డున పడ్డ హీరోయిన్

అలాంటిది సూపర్ గా ఎదిగే టైంలో పెళ్లైన వాడితో చేసిన ప్రేమాయణం వల్ల రోడ్డున పడ్డ హీరోయిన్ గురించి తెలుసుకోవల్సిందే 


Published Aug 19, 2024 11:52:43 PM
postImages/2024-08-19//1724080333_back.PNG

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరోయిన్ గా అవకాశం రావడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో డక్కామోక్కీలు తిని ఈ అవకాశాలు అందుకుంటారు. అలాంటిది సూపర్ గా ఎదిగే టైంలో పెళ్లైన వాడితో చేసిన ప్రేమాయణం వల్ల రోడ్డున పడ్డ హీరోయిన్ గురించి తెలుసుకోవల్సిందే 


నిఖితా తుక్రాల్ ...తెలుగు లో చాలా సినిమాలు చేసింది. టాప్ హీరోయిన్ అనలేం కాని చిన్న చిన్న సినిమాలన్నింటికి చాలా వరకు హీరోయిన్ గా చేసింది. ఎన్నో  హిట్టు మూవీస్ కు హీరోయిన్ గా చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా గడిపిన హీరోయిన్ నిఖితా తుక్రాల్. అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. కెరీర్ లో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా సినిమా ఆఫర్స్ కోల్పోయింది. స్టార్ అవ్వాల్సిన నిఖితా ఆల్రెడీ పెళ్లైనా దర్శన్ తో తిరగడం వల్ల తన కెరియర్ ను నాశనం చేసేసింది హీరో భార్య.


హాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిఖితా . ఆ తర్వాత తెలుగులో సంబరం, కళ్యాణ రాముడు, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కన్నడ హీరో దర్శన్ తో ప్రేమాయణం నడిపించింది. ప్రస్తుతం అభిమాని హత్య ఆరోపణలతో జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్. అప్పట్లో దర్శన్ భార్య అతడి పై గృహహింస కేసు కూడా పెట్టింది.

ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. దర్శన్ కేసులో నిఖిత పేరు చాలా గట్టిగా వినిపించింది. అంతేకాదు నిఖితను కన్నడ నిర్మాతల సంఘం మూడేళ్లు బ్యాన్ కూడా చేసింది.నెలల తర్వాత నిషేధం ఎత్తివేసినా కూడా నిఖితాకు ఆఫర్స్ రాలేదు. దీంతో ఆమె సినీరంగానికి దూరం కావాల్సి వచ్చింది. 2017లో వ్యాపారవేత్త గగన్ దీప్ మాగోను వివాహం అయ్యింది. కూతురు పుట్టింది ..అయినా సినిమాల్లో అవకాశాలు లేవు. ఇక మెల్లగా సినిమాల్లోంచి తప్పుకుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news darshan

Related Articles