Chiru:చిరుతో ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ..పాత్ర అదుర్స్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  సీనియర్ టాప్ హీరోలలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి చిరుతో నటించాలంటే  నటీనటులకు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి చిరంజీవి ఏడు


Published Aug 21, 2024 04:47:12 AM
postImages/2024-08-21/1724229119_chiranjeevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  సీనియర్ టాప్ హీరోలలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి చిరుతో నటించాలంటే  నటీనటులకు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి చిరంజీవి ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి చివరగా బోలా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.  ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్షన్ చేయగా వేదాళం సినిమాకు  రీమేక్ గా వచ్చింది. ఈ చిత్రం తెలుగులో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.  అంతేకాకుండా ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా, తమన్నా హీరోయిన్ గా చేసింది.

అయినా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అయితే ఈ డిజాస్టర్ నుంచి బయటపడాలి అంటే రాబోవు "విశ్వంభర" సినిమా అద్భుతమైన హిట్ సాధించాలి.  అందుకే డైరెక్టర్ వశిష్ట చిత్రాన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. నటీనటుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఈ విధంగా సోషియో ఫాంటసీ కథలో వస్తున్నటువంటి విశ్వంభర చిత్రంలో  త్రిష హీరోయిన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమెనే కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ కూడా ఇందులో చేయబోతున్నారట.

అలాంటి ఈ తరుణంలో ఈ కొత్త హీరోయిన్ కూడా  చిరంజీవి పక్కన నటించిన ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరయ్యా అంటే రమ్య పసుపులేటి. చిరంజీవి పక్కన కీలకపాత్రలో చేస్తుందట. ఈ సినిమాలో రమ్య చిరంజీవి చెల్లిగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే రమ్య పసుపులేటి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.  ఈమె హుషారు, ఫస్ట్ ర్యాంకు రాజు, కమిట్మెంట్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, మైల్స్ ఆఫ్ లవ్ వంటి సినిమాల్లో చేసింది.  ఈ విధంగా దూసుకుపోతున్న రమ్య పసుపులేటి చిరంజీవి సరసన విశ్వంబరలో చెల్లెలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu trisha vishwambhara ramya-pasupuleti

Related Articles