ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎన్ని కఠిన శిక్షలు వేసినా ఆగంతకులు ఆగడం లేదు. ఏదో ఒక దగ్గర ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎన్ని కఠిన శిక్షలు వేసినా ఆగంతకులు ఆగడం లేదు. ఏదో ఒక దగ్గర ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా రోజుకు వేలాది అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం లక్ష 12 వేలకు పైగా అత్యాచార ఫిర్యాదులు వచ్చాయట.
ఈ విధంగా చాలామంది అత్యాచారం చేసి కూడా రాజకీయ పలుకుబడి, డబ్బు ద్వారా ఎలాగోలా తప్పించుకుంటున్నారు. అలాంటి వాటినుండి ఆడపిల్లలను కాపాడడానికి ఒక లేడీ డాక్టర్ మంచి ఆలోచన చేసి పరిష్కారాన్ని కనిపెట్టింది. సౌతాఫ్రికా డాక్టర్ సోనేట్ ఎత్యులర్స్. మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలను చూసి చాలా బాధపడింది. వీరికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన మగవారిలో మార్పు రావడం లేదని గ్రహించిన, ఆమె ఏదో ఒక రకంగా అమ్మాయిలను కాపాడాలని ఒక సాధనాన్ని కనిపెట్టింది.
దాని పేరే రేప్ యాక్స్.. ఇది పదునైన ముళ్ళతో ఉంటుందట. దీన్ని మహిళలు కండోమ్ మాదిరిగా ధరించుకోవచ్చు. ఎప్పుడైనా మహిళలు బయటకు వెళ్లిన సమయంలో ఎవరైనా బలవంతం చేసి లోబర్చుకోవాలని చూస్తే ఈ రేప్ యాక్సు తన ముళ్ళతో వారి యొక్క అంగాన్ని తీవ్రంగా గాయపరుస్తుందట. ఒక్కోసారి పురుషుడి వృషణాలు కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుందట.
దీన్ని ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండదని, బలాత్కార సమయంలో మాత్రమే మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ సాధనం గురించి సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఇది తొందరగా ఇండియాకు తెప్పించాలని కొంతమంది మహిళలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.
https://www.instagram.com/p/CTrj9x7FeQr/?utm_source=ig_web_copy_link