INDRANEEL: నా ఇమేజ్ కు బిగ్ బాస్ సెట్ కాదు..షో కోసం ఆ పని చెయ్యలేను

ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పేరు వినిపిస్తున్నా రెస్పాండ్ కాలేదు.


Published Aug 29, 2024 10:49:00 PM
postImages/2024-08-29/1724952023_mogalirekuluserialfameindraneellovemarriagenews.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకో నాలుగు రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా కంటెస్టెంట్స్ లొల్లే నడుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో ఇంకా ఫైనల్ కాని సెలబ్రెటీ ఇంద్రనీల్ రీసెంట్ గా బిగ్ బాస్ పై కామెంట్లు చేశారు. బిగ్ బాస్ మేకర్స్ రెండుసార్లు ఇంటర్వ్యూ చేశారంటూ ఇంద్రనీల్ కీలక విషయాలు వెల్లడించాడు.. ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పేరు వినిపిస్తున్నా రెస్పాండ్ కాలేదు.


బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదించిన మాట వాస్తవమే... కానీ నేను వెళ్లడం లేదన్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు నాకు కాల్ చేశారు. నాకు ఇంట్రస్ట్ లేదని చెప్పా. ఇంటర్వ్యూ కి రమ్మంటే వెళ్లాను.  ముంబై వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లాలనే ఆసక్తి నాకు కలిగింది. మొదటి ఇంటర్వ్యూలో వాళ్ళు విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. షోకి కావలసిన కంటెంట్ కోసం ఏవేవో అడిగారు. బిగ్ బాస్ షో అప్ కమింగ్ ఆర్టిస్ట్స్ కి, షోకి వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి హెల్ప్ కావచ్చు. నాకు వాళ్లు ఇస్తామన్న సెలబ్రెటీ స్టేటస్ ఆల్డ్రెడీ ఉంది.


షోకి వెళ్ళాక గొడవలు పడాలి. నామినేషన్స్ లో గట్టిగా అరవాలి. ఇవన్నీ తలచుకుని బిగ్ బాస్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అసలు అక్కడికి వెళ్లాక ఉన్న పేరు పోతే ఏం చేస్తాం. అందుకే ఉన్నదాంట్లో హ్యాపీగా ఉందామని డిసైడ్ అయ్యానంటు చెప్పుకొచ్చారు. వరుసగా ఆరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu youtube contestents bigboss8

Related Articles