Jayam Ravi: ఆ హీరోయిన్ తో జయం రవి ఎంగేజ్మెంట్..?

ఈ మధ్యనే భార్యతో విడాకులు ప్రకటించిన జయం రవి తాజాగా రెండో పెళ్లికి రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.. మరి ఇంతకీ జయం రవి పెళ్లి చేసుకోబోయేది ఎవర్ని..నిజంగానే వీరి పెళ్లి


Published Oct 03, 2024 05:55:59 PM
postImages/2024-10-03/1727958359_jayam.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యనే భార్యతో విడాకులు ప్రకటించిన జయం రవి తాజాగా రెండో పెళ్లికి రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.. మరి ఇంతకీ జయం రవి పెళ్లి చేసుకోబోయేది ఎవర్ని..నిజంగానే వీరి పెళ్లి జరగబోతుందా అనేది చూస్తే.. తాజాగా జయం రవి నటి ప్రియాంక మోహన్ కి సంబంధించి దండలు మార్చుకున్న ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఆ ఫోటోలో ఇద్దరు నిశ్చితార్ధానికి ఎలా అయితే రెడీ అవుతారో అలా రెడీ అయ్యి  దండలు మార్చుకున్నన్నారు. ఇక మరో ఫోటోలో జయం రవి మీద చేయి వేసి ప్రియాంక మోహన్ రొమాంటిక్ గా కూర్చుంది. ఇక ఈ ఫోటోలు చూసినా చాలా మంది నెటిజన్స్ ఏంటి జయం రవి ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.

అయితే జయం రవి ప్రియాంక మోహన్ ల నిశ్చితార్థం గోవాలో రహస్యంగా జరిగినట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రియాంక మొహన్ రీసెంట్ గానే నానితో సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది జయం రవి అభిమానులు ఈ వార్తలను ఖండిస్తున్నారు.

ఎందుకంటే ఈ ఫోటోలు రియల్ ఎంగేజ్మెంట్ వి కాదని, వీరిద్దరూ కలిసి నటిస్తున్న బ్రదర్ సినిమాలోని ఓ పాటలోనివి అని చెబుతున్నారు.మరి సీక్రెట్ ఎంగేజ్మెంట్ వార్తలపై జయం రవి అలాగే ప్రియాంక మోహన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి

newsline-whatsapp-channel
Tags : news-line jayam-ravi nani saripoda-shanivaram priyanka-mohan jayam-ravi-divorce

Related Articles