ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టార్ హీరో జయం రవి విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే 15 ఏళ్ల వైవాహిక బంధానికి జయం రవి గుడ్ బై చెప్పడంతో చాలామంది ఆయన అభిమానులు బాధపడుతున్నారు.కానీ ఇది
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టార్ హీరో జయం రవి విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే 15 ఏళ్ల వైవాహిక బంధానికి జయం రవి గుడ్ బై చెప్పడంతో చాలామంది ఆయన అభిమానులు బాధపడుతున్నారు.కానీ ఇది భార్యాభర్తల మధ్య జరిగే పర్సనల్ మ్యాటర్ కాబట్టి వాళ్ల విడాకులకి గౌరవం ఇస్తూ వారి ప్రైవసీ వారికే వదిలేస్తున్నారు.అయితే కొంతమంది మాత్రం అటు విడాకులు అవ్వడంతోనే ఇటు రెండో పెళ్లి వార్తలు వైరల్ చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అదేంటంటే..జయం రవి ఆ లేడీ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకుంటారని తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇంతకీ జయం రవి రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు స్టార్ హీరో రజినీకాంత్ కూతురు డైరెక్టర్ సౌందర్య రజినీకాంత్..
అయితే ధనుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌందర్య 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం ఈమె సింగిల్ గానే ఉంది. ఇక జయం రవి కూడా విడాకులు తీసుకొని సింగిల్ అయిపోయారు.అయితే గతంలో జయం రవి ఆర్తిని పెళ్లి చేసుకోకముందు రజినీకాంత్ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారట.కానీ అది కుదరలేదు. అయితే ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు సబితా జోసెఫ్ చెప్పారు.
అయితే ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతూ జయం రవి సౌందర్యల మొదటి పెళ్లి కుదరలేదు.కానీ దేవుడు మళ్ళీ వీరికి రెండో అవకాశం ఇచ్చారు కావచ్చు.. అందుకే వీరి మొదటి పెళ్లి విఫలం అయింది.రెండో పెళ్లి ద్వారా వీళ్లిద్దరు ఒకటవ్వుతారు కావచ్చు అంటూ ఒక మ్యాటర్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి జయం రవి, సౌందర్యల రెండో పెళ్లి వార్తలను వాళ్ళు ఎలా ఖండిస్తారో చూడాలి