madarasi: మదరాసి క్లోజింగ్ కలక్షన్స్...శివకార్తీకేయన్ కు లాభలు వచ్చినట్లేనా!

ఇండియాలో 13 రోజుల వరకు శివకార్తీకేయన్ మూవీకి 60 కోట్ల రూపాలయ నెట్, 68 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది.200 కోట్ల పెట్టుబడి పెడితే అన్ని కలిపి సగమే రావడం మూవీ టీం కు కాస్త బాధపెట్టింది.


Published Sep 19, 2025 10:04:00 AM
postImages/2025-09-19/1758256522_articlel2025924717231662596000.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ లో ఎన్ శ్రీ లక్ష్మీప్రసాద్ నిర్మించిన మదరాసి మూవీ  సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ  లో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమవాల్ , బిజు మీనన్ కలిసి నటించారు. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా శివకార్తీకేయన్ కు వరుస విజయాన్ని అందించింది. మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీ మదరాసికి ఇండియా వైడ్ తొలిరోజున 15 కోట్ల రూపాయలు, 2వ రోజున 13 కోట్ల రూపాయలు, 3వ రోజున 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 13 రోజుల వరకు శివకార్తీకేయన్ మూవీకి 60 కోట్ల రూపాలయ నెట్, 68 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది.200 కోట్ల పెట్టుబడి పెడితే అన్ని కలిపి సగమే రావడం మూవీ టీం కు కాస్త బాధపెట్టింది.


స్టార్టింగ్ మంచి బజ్ తో స్టార్ట్ అయినా ..తర్వాత తర్వాత వచ్చిన సినిమాలు మంచి హిట్లు కావడంతో మదరాసీ కలక్షన్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. మిరాయ్ , కిష్కిందకాండ, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాల ఎఫెక్ట్ కొంత మదరాసీ పై ఉందంటున్నారు సినిమా వర్గాలు. నిజానికి ఆ సినిమాలు వచ్చినా శివకార్తీకేయ మంచి పోటీ ఇచ్చాడనే చెప్పాలి. సినిమా హిట్ టాక్ వచ్చినా కాని జస్ట్ బడ్జెట్ లో సగం మాత్రమే వసూలు చేసి 100 కోట్ల నష్టాన్ని టేస్ట్ చేశారు మూవీ టీం. అయితే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తమిళ వర్గాలు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shiva

Related Articles